Friday, October 18, 2013

అబార్షన్ కు కారణం ...

సాధారణంగా మహిళలు గర్భం ధరించగానే, చాలా మంది డాక్టర్స్ కొన్ని రకాలా ఆహారాలకు దూరంగా ఉండమని సలహాలిస్తుంటారు. ముఖ్యంగా, మొదటి మూడు నెలల్లో గర్భాశయంలో పిండం ఏర్పడుతుంది కాబట్టి, మొదటి మూడు
నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చాలా అవసరం అని చెబుతుంటారు. గర్భిణీ స్త్రీలు తినకూడని, శరీరానికి వేడికలిగించే ఆహారా పదార్థాలకు, కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండమని సూచిస్తుంటారు. కానీ ఆహారాల్లో వీటితో పాటు కొన్ని రకాల కూరగాయలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడ గర్భిణీలో అబార్షన్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. గర్భం ధరించిన మహిళలు ఈ కూరగాయలకు తప్పకుండా దూరంగా ఉండాలి. అయితే ఈ క్రింద ఇచ్చిన ఏదైనా కూరగాలో కూడా మీకు తినలాని ఎక్కువగా కోరిక కలిగినప్పుడు ఏ చిన్న మోతాదు తీసుకొన్నా చాలా ప్రమాధకరం. గర్భం ధరించిన ఫస్ట్ సెమిస్ట్రర్(మొదటి మూడు నెలలు) సమయంలో, గర్భంలో పెరిగే పిండం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ త్రైమాసం కూడా చాలా సున్నితంగా బావిస్తారు. ఏ ఆహారమైనా లేదా ఏ పదార్థం అయినా రియాక్షన్ కలిగించవచ్చు. కాబట్టి వీటిని మీ రెగ్యులర్ డైట్ నుండి తప్పించడం మంచిది. వీటిలో, ఏవైనా సరే, అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది కాదు, అందువల్ల, ఈ కూరగాయలను తినడం పూర్తిగా మానేయడం లేదా చాలా తక్కువ మేరకు మాత్రమే తీసుకోవడం వలల మీరు సురక్షితంగా ఉండవచ్చు. నిపుణుల ప్రకారం ఈ ఆహారాల్లో అధికంగా విటిమన్స్ ఉంటాయి. ఈ విటమిన్లు, పిండం పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అధిక విటమిన్ల వల్ల మొదటి త్రైమాసికంలో రక్తస్రావానికి గురిచేస్తుంది. మరియు అనియంత్రిత ఒక బలమైన తిమ్మిరులను కలుగుజేస్తుంది. గర్భిణీ స్త్రీల కొరకు కొన్ని తినకూడని కూరగాయల లిస్ట్ ను ఇక్కడ మేము అందిస్తున్నాం, గర్భధారణ సమయంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. సురక్షితమైన గర్భం పొందడానికి, వీటిని పూర్తిగా నివారించడం ఉత్తమం.


1 comment: