Thursday, October 10, 2013

రెచ్చిపోయిన దుర్గగుడి ఆలయ ఈవో

దుర్గ గుడి ఈవో ప్రభాకర్ రెచ్చిపోయారు. దసరా నవరాత్రి ఉత్సవాలని కూడా చూడకుండా ఆలయంలోనే రౌడీగా మారారు. సహోద్యోగి పైనే వీరంగం వేశారు. క్యూలైన్లో భక్తులను
అదుపు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా క్యూలైన్లో వెళుతున్న ఉద్యోగిని కాలితో తన్నాడు. గురువారం ఉదయం పవిత్రమైన అమ్మవారి గర్భగుడిలో తోటి ఉద్యోగి పై దుర్గ గుడి ఈవో ప్రభాకర్ భౌతికంగా దాడికి దిగడంపై అనేక విమర్శలకు దారితీసింది. ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ అనుచిత ప్రవర్తనపై అధికారులు, సిబ్బంది, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. 

No comments:

Post a Comment