Saturday, September 7, 2013

'సింధూ మీనన్' ఆత్మహత్యాయత్నం..?

దక్షిణాది నటి 'సింధూ మీనన్' ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్న వార్త తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. చెన్నయ్ లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. అధిక మోతాదలో నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, దీంతో వెంటనే ఆమెను చెన్నయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. . ప్రస్తుతం సింధూ పరిస్థితి విషమంగా ఉందని వార్తలతో దక్షిణాది సినీ ఇండస్ట్రీ దిగ్భ్రంతికి గురయ్యింది.
సింధూ తెలుగులో 'చందమామ', 'వైశాలి' సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సినీ విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఆ తర్వాత ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకొని గత కొద్ది కాలంగా చెన్నయ్ లో ఉంటుంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఓ సొంత ప్రొడక్షన్ ప్రారంభించినట్లు సమాచారం. దీనిలో స్వతహాగా సినిమాలు నిర్మించడానికి ఇతరుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకొని అవి తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలుస్తోంది.

No comments:

Post a Comment