కలిగిన విసుగు, అలసటను తరిమేసే విధంగా వారాంతంలో ఏదైనా వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదూ! అవును.. అదే కామెడీ క్లబ్. విదేశాల్లో ఇలాంటి క్లబ్‌లు మామూలు. కానీ మనకు కొత్త. వారాంతంలో ఆఫీసు పని తాలూకు ఒత్తిడిని తరిమివేసేందుకు ఇటీవలే 'కామెడీ క్లబ్'ను తెరిచారు ప్రనూప్ జవహర్ అనే 24 ఏళ్ల హైదరాబాదీ కుర్రాడు.
సాధారణంగా ఒత్తిడి తగ్గాలంటే సినిమాకో, షికారుకో, ఏ పార్టీకో వెళ్లడం రివాజు. కానీ ఇలా కామెడీ క్లబ్‌కు జనం వెళతారని ప్రనూప్‌కు ఎలా తెలుసు? అంటే.. ఆయన అంతర్జాతీయ బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువు రీత్యా బ్రిటన్‌లో ఉన్నపుడు ఇలాంటి కామెడీక్లబ్‌లకు వెళ్లేవారు. అక్కడ గడచిన వారపు పని ఒత్తిడి తగ్గించుకొనేందుకు వారాంతంలో ఈ కామెడీ క్ల్లబ్‌కు జనం ఎగబడి రావడం చూశారు. ఇలాంటిది మన హైదరాబాద్‌లో కూడా నెలకొల్పాలని అనుకొన్నారు. 2010లో చదువు అయి పోయాక హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు మిత్రులతో చర్చించారు. పని తరువాత తన మిత్రులందరికీ చిరాకుగా అనిపించడం చూశారు. వారాంతంలో ప్రతిసారీ పార్టీలు చేసుకోవడం కూడా విసుగు తెప్పించేదేనని తెలుసుకొన్నారు. విరుగుడుగా హైదరా బాద్‌లో కామెడీ క్లబ్ తెరిస్తే ఎలా ఉంటుందో మళ్లీ మిత్రులతో కలిసి ఆలోచించారు. ఆ ఆలోచన నచ్చి, మిత్రులంతా వెంటనే సరేన న్నారు. ఫలితంగా గత మేలో హైదరాదాద్‌లో మొదటి స్టాండప్ కామెడీ క్లబ్ వెలిసింది.
విదేశాలలో స్టాండప్ కామెడీ ప్రదర్శనలు తరచూ జరుగుతుంటాయి. ఒక హాస్య నటుడు నవ్వించే తమాషా సంగతులు చెబుతూ ఇచ్చేదే స్టాండప్ కామెడీ ప్రదర్శన. చిన్న చిన్న మ్యాజిక్‌లు చేస్తూ కూడా అతడు నవ్విస్తాడు. కామెడీ క్లబ్‌లో ఇటువంటి హాస్యనటుణ్ణి పిలిపించి ప్రదర్శన ఇప్పించడం కూడా ఉంటుంది. మామూలుగా ఇది జోక్స్ క్లబ్ లాంటిదే. అయితే స్టాండప్ కామెడీ క్లబ్ ఆలోచనను అమలులో పెట్టడం ప్రనూప్ అండ్ కోకు అంత సులభం కాలేదు. ఈ ప్రాజెక్టు కృషి వెనుక ప్రనూప్‌కు అండగా నిలిచారు మిత్రులు మనోతేజ్, విశాల్, అనిరుధ్. ముందు ప్రనూప్ స్వయంగా తానే ఈ క్లబ్‌ను ప్రారంభించారు. తరువాత అతని మిత్రులు తోడయ్యారు.
మొదటి రెండు వారాలూ వారికి క్లబ్ ఎలా నడుస్తుందో అనే బెంగతో గడిచింది. అసలు ప్రేక్ష కులు క్లబ్‌కు వస్తారా అన్న సందేహం వారిని పీడించింది. ఐతే ఆశ్చర్యకరంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను చూసి, వారు ఆశ్చర్య పోయారు. వారాంతపు ఒత్తిడిని తొలగించే ఇలాంటి వెసులుబాట్లు లేని కొరతను హైదరా బాద్ వాసులు ఎంతగా అనుభవిస్తున్నారో దీన్నిబట్టి చెప్పవచ్చు. ఇప్పటికీ ఆ స్పందన అలాగే ఉంది. దాంతో, నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నోటి ద్వారా జరిగిన ప్రచారం ఫలితంగానే తమ క్లబ్‌కు జనం తరలి వస్తున్నారని ప్రనూప్ తెలి పారు. తన సొంత కుటుంబం డబ్బుతో ఈ క్లబ్‌ను నెలకొల్పానన్నారు. గమ్మత్తేమిటంటే, ఈ క్లబ్ గురించి ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఆ నోటా ఆ నోటా చెప్పుకోవడం ద్వారా లభించిన ప్రచారమే వారికి కలసి వచ్చింది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ నచ్చడం వల్లే తమ క్లబ్‌కు జనం వస్తున్నారని ప్రనూప్ అంటున్నారు. క్లబ్‌లో బాగా హిట్టయిన ఓ కాన్సెప్ట్‌ను వివరిస్తూ ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి ఒకరిని ఎంపిక చేసి వారిపై హాస్య నటుడు జోక్ వేస్తారనీ, అది బాగా హిట్టయిందనీ చెప్పారు. ''మొదటి ప్రదర్శనకు ఆహ్వా నించిన వారికి ఈ ఆలోచన నచ్చి మిత్రులకు తెలి పారు. అలా మా క్లబ్‌కు ప్రేక్షకాదరణ పెరిగింది'' అని ప్రనూప్ తెలిపారు. ఈ ఆలోచన అర్థం కానివారు తమ ప్రదర్శనకు దయచేసి రావద్దనీ, అర్థం కాకుండా ఆనందించలేరనీ ప్రనూప్ అంటు న్నారు. పబ్‌లు, పార్టీలు నచ్చని చాలా మందికి తమ క్లబ్ ఒత్తిడి నుంచి విముక్తినిచ్చే మంచి ఆలంబన అని ఆయన అన్నారు. అమెరికా నుంచి రాజ్ శర్మ, ముంబరు నుంచి గురు సిమ్రాన్ ఖంబా, ఢిల్లీ నుంచి విపుల్ గోయల్, బెంగళూరు నుంచి సంజరు మనక్తలతో సహా ఎందరితోనే ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. వారానికి ఒకసారి ఈ ప్రదర్శనలుంటాయి. వీర్‌దాస్, రస్సెల్ పీటర్స్ లాంటి గొప్ప కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించేం దుకు ఆర్థిక స్థితి అడ్డు వస్తోందన్నారు. హైదరా బాద్ నగరంలో స్టాండప్ కామెడీ ప్రదర్శనలు నిలదొక్కుకొనే దాకా వారు వేచి ఉండదలిచారు. హాస్య నాటకాలకు వేరే వేదికలు చాలా ఉన్నాయి కనుక తమ ప్రదర్శనలలో ప్రతి క్షణం ఓ జోక్ ఉంటుంది తప్ప కామెడీ నాటకాలను వేయనున్నారు.
No comments:
Post a Comment