Saturday, September 7, 2013

'రికార్డు'లపై ఆ..ఇద్దరు హీరోల కన్ను!


బాలీవుడ్ ల స్టార్ హీరోల మధ్య వార్ జరుగుతోంది. అది మాములు వార్ కాదు.. అది ఏకంగా వందల కోట్లతో కూడుకొన్న రికార్డుల వార్. అందేంటో చూద్దాం.. 'అమీర్ ఖాన్ .. లేట్ గా సినిమాలు చేసినా లేటెస్ట్ గా రికార్డులు కొల్లగొడుతాడు. ఇప్పటికే 'గజని', 'త్రీ ఇడియట్స్' లాంటి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు. ఇప్పుడు ధూమ్ -3తో మరోసారి కొత్త రికార్డ్ లపై కన్నేశాడు ఈ ఇడియట్. కానీ అమీర్ ఆశల పై 'క్రిష్' నీళ్లు చల్లబోతున్నాడట. హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్ -3' ట్రైలర్ ఇప్పటికే కోటి పైగా హిట్స్ సంపాదించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. హాలీవుడ్ సినిమా రేంజ్ లో కనిపిస్తున్న క్రిష్-3 తో ఇండియాలో సరికొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుందేమో అనేలా ఉంది ఈ ట్రైలర్. ఇక ఈ దీపావళికి వస్తున్న ఈ మూవీ ఇప్పటి వరకూ ఇండియాలో ఉన్న అన్ని సినిమాల రికార్డులను తుడిచివేస్తుందని బాలీవుడ్ టాక్.
     ఇక క్రిష్ సృష్టించే రికార్డులను మళ్లీ తన 'ధూమ్ -3' తో దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నాడు అమీర్ ఖాన్. రీసెంట్ గా రిలీజ్ చేసిన 'ధూమ్-3 టీజర్' కూడా అదుర్స్ అనేలా ఉండటంతో క్రిష్, ధూమ్ ల మధ్య పెద్ద పోటీ జరగబోతోంది. ఇక డిసెంబర్ 20న విడుదల కాబోతోంది ధూమ్. సో ఈ రెండు సినిమాల్లో ఇండియా సినిమా రికార్డులను తిరగరాసే చిత్రం ఏదవుతుందో వేచి చూద్దాం.

No comments:

Post a Comment