వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ కోర్టుకు
అధికారులు విజ్ఞప్తి చేశారు. బెయిల్ మంజూరు చేయాలని
కోరుతూ నాంపల్లిలోని
సిబిఐ కోర్టులో జగన్ వేసిన పిటిషన్ పై బుధవారం సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు
చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని..బెయిల్ పై జగన్
బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని..విచారణకు ఆటంకం
కలుగుతుందని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఒకటి, రెండు అంశాలు మినహా
కేసు దర్యాప్తు పూర్తైందని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు
కొనసాగుతోందని సిబిఐ అధికారులు పేర్కొన్నారు. జగన్ తరపున సుప్రీం కోర్టు
న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు.
No comments:
Post a Comment