సినిమాల్లో స్టోరీ ఎలా ఉన్న ప్రేక్షకులు ఎక్కువగా పాటలనే ఇష్టపడుతుంటారు.
ఒక సినిమాలో సాంగ్స్ హిట్ అయితే దాదాపు సినిమా సగం హిట్ అయినట్టే. ఆడియోకు
ఉన్న క్రేజ్ కూడా అలాంటిది. ఏ ఇండస్ట్రీలో నైనా.. సాంగ్స్ కు
చాలా
ప్రాముఖ్యతనిస్తారు. పాటలేని సినిమాలను ఊహించుకోవడం కూడా కష్టమే. ఈ
పాటలన్నిటికీ ముఖ్య కారణం సింగర్స్. వారి గొంతులోని మాధ్యుర్యాన్ని పాటల
రూపంలో వింటుంటే ఆ థ్రిల్లే వేరు. అయితే ఒకప్పుడు చాలా వరకు మన సినిమాలకు
తెలుగు సింగర్సే పాడేవారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. ప్రతి
సినిమాలోనూ తెలుగు రాని పరభాషా సింగర్స్ తో పాడిస్తున్నారు. ఒక్కో సంగీత
దర్శకుడు ఒక్కో సింగర్స్ తో తన సినిమాలో పాడిస్తుంటారు. దీంతో తెలుగు
సింగర్స్ ను పక్కన పెడుతున్నారు. సొంతింటి కూరను పక్కన పెట్టి పొరిగింటి
పుల్ల కూరలపై మోజు పెంచుకుంటున్నారు.టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న పరభాషా సింగర్స్...
'సారోస్తారా'.. 'బిజినెస్ మాన్' సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన పాట. ఈ పాటకు పాడింది తమిళంకు చెందిన సింగర్ 'సుచిత్ర'. తమిళ్ రేడియో మిర్చి లో ఆర్ జె గా ఉన్న సుచిత్ర తనదైన స్టైల్ పాటలు పాడి ఎందరినో ఫాన్స్ గా మార్చేసుకుంది. తమన్ సంగీతం అందించే ప్రతీ చిత్రంలో ఈమె పాట ఉండి తీరాల్సిందే. అలాగే మలయాళం లో కూడా సుచిత్ర తన హవా కొనసాగిస్తోంది. రీసెంట్ ఈమె 'నాయక్' సినిమాలో 'యవార మంతా ఏలూరే..' పాటతో మెగా ఫ్యాన్స్ ను తనవైపు తిప్పుకుంది. 'పోకిరి'లో 'ఇప్పటికింకా.. నా వయసు నిండా పదహారే..' పాటతో యూత్ లో వేడిని రగిల్చింది.
'శ్రేయా ఘోషల్'.. క్లాస్ పాటకైనా - మాస్ బీట్ కైనా ఈజీగా సూటయ్యే గొంతు ఆమెది . హిందీ 'దేవదాస్' సినిమాతో సినీ గాయనిగా పరిచయమైన శ్రేయ.. ఆ తరువాత తెలుగు ..తమిళ్ ..మలయాళం ...కన్నడ ...బెంగాలి చిత్రాలలో గాయనిగా తన సత్తా చాటుతోంది. 'శ్రీరామ రాజ్యం', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'నాయక్', 'ఎవడు' వంటి సినిమాల్లో పాటలు పాడి తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు. 'సారిగమ పా' .. పాటల ప్రోగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా .. ఆ తరువాత సినీ నేపథ్య గాయనిగా పాటల ప్రయాణం ప్రారంభించింది. 'యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఒహియో' గవర్నర్ టెడ్ స్ట్రిక్ లాండ్ .. శ్రేయా పాటలకు పులకించి పోయి 2010 సంవత్సరం లో జూన్ 26 ను 'శ్రేయ ఘోషల్ డే' గా ప్రకటించారు. ఏ తరహా పాట తీసుకున్నా అందులో తన ప్రత్యేకతను చాటుకోవడం శ్రేయాకు వెన్నతో పెట్టిన విద్య.
మగధీరా సినిమాలో పంచదార బొమ్మ పాటతో ఫేమస్ అయిన మరో సింగర్ 'రీటా'... చెన్నయ్ కు చెందిన రీటా తెలుగులో దూసుకుపోతుంది. 'బంతి పూల జానకి' పాటతో తెలుగు వారి మనసును దోచుకున్న మరో సింగర్ 'రవీనా రెడ్డి'. బెంగుళూరు కు చెందిన ఈ సింగర్. అయిదు ఏళ్ల వయసు నుంచి సంగీతం నేర్చుకొని తన పాటలతో మైమరిపించేస్తుంది. 'ఆరెంజ్', 'రంగం', 'ఎవడు', 'బలుపు'లాంటి సినిమాల్లో రవీనా పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి. 'తమన్' అవకాశం ఇచ్చిన మరో పర బాషా గాయని 'రమ్య'. 'దూకుడు' చిత్రం లోని 'పువ్వై పువ్వై..' పాట
రమ్య ని టాలీవుడ్ లో టాప్ స్టార్ సింగర్ గా నిలిబెట్టింది. ఆమె వాయిస్ లోని మత్తు గమ్మత్తుతో యువతను చిత్తు చేస్తుంది.
ఇతర భాషల సింగర్స్ కు దీటుగా తెలుగు సింగర్స్..
తెలుగులో క్లాసికల్, రొమాంటిక్ పాటలు పాడే వారు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రస్తుతం టాలీవుడ్ లో హవా సాగిస్తున్న సింగర్ 'గీతా మాధురి'. క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్ లో శిక్షణ పొందిన గీతా... 'జోడి' అనే పాటల ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ' ప్రేమ లేఖ రాసా..' సినిమాతో గాయనిగా తొలి పాట పాడి అందరిని ఆకట్టుకొంది. ఆ తరువాత 'చిరుత' సినిమాలోని 'చంకా చంకారే..' పాటతో టాలీవుడ్ లో క్రేజీ సింగర్ గా మారింది. ఆమె పాటలోని రొమాంటిక్ టచ్ ను గుర్తించిన సంగీత దర్శకులు.. 'డార్లింగ్', 'షాడో' వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ లకు పాటలు పాడించారు. ఈ పాటలతో మాస్ సంగీత ప్రియులను సైతం తన వైపు తిప్పుకుంటోంది.
టాలీవుడ్ లో మరో తెలుగు గాయని 'మాళవిక'.. 'గంగోత్రి' సినిమాలో 'నువ్వు నేను కలిసుంటే నాకెంతో ఇష్టం..' పాటతో సంగీత ప్రియులను ఆకర్షించింది. 'పాడుతా తీయగా' ప్రోగ్రాంతో గుర్తింపు పొందిన మాళవిక..'రాజన్న' సినిమాలోని 'అమ్మా అవని..' పాటకు 'నంది' బహుమతి కూడా పొందింది. ఇక తెలుగులో రాణిస్తున్న మరో గాయని అంజనా సౌమ్యా. 'కర్నాటిక్' సంగీతంలో డిప్లొమా పొందిన అంజనా గాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆకాశ వాణి ద్వారా ఆమె గోల్డ్ మెడల్ కూడా అందుకుంది. రీసెంట్ గా 'సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు' సినిమాలో 'స్వాతి చినుకులు..' పాటతో విమర్శల ప్రశంసలు అందుకుంది.
వీరే కాక 'సునీతా', 'కౌసల్యా' లాంటి ఎందరో ప్రతిభ ఉన్న గాయనీమణులు మన తెలుగులో ఉన్నారు. పొరిగింటి పుల్ల కూరకి అర్రులు చాచ కుండా తెలుగు సింగర్స్ ను మంచి అవకాశాలు ఇచ్చి.. తెలుగు సినిమాల్లో తెలుగు పాటకు ప్రాధాన్యతనిస్తూ.. మన సింగర్స్ ను ప్రోత్సహించాలని కోరుకుంద్దాం..

No comments:
Post a Comment