Wednesday, September 18, 2013

ఓ వ్యక్తి 17 నెలల పాటు నిర్బంధించి ఆమెపై అత్యాచారం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల వయస్సు గల పాలిటెక్నిక్ విద్యార్థినిని ఓ వ్యక్తి 17 నెలల పాటు నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఓ కాలేజీ క్యాంటీన్ యజమాని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ అమ్మాయి నిర్బంధం నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఈ వ్యవహారంలో సత్యప్రకాష్ సింగ్ అనే 30 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల రియాసత్‌నగర్‌కు చెందిన అమ్మాయిని నిరుడు ఏప్రిల్ నుంచి నగర శివారులో వివిధ ఇళ్లకు మారుస్తూ ఆమెపై సత్యప్రకాష్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యలో ఓసారి ఆ అమ్మాయికి అబార్షన్ కూడా అయినట్లు తెలుస్తోంది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు - నిరుడు ఏప్రిల్ 3వ తేదీన సత్యప్రకాష్ సింగ్ అమ్మాయికి మత్తుపదార్థాలు కలిపిని పళ్ల రసం ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆమెను అపహరించాడు. ఆమెను ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారుస్తూ వచ్చాడు. అతను నిద్రిస్తున్న సమయం చూసి ఈ నెల 4వ తేదీన అమ్మాయి పారిపోయి వచ్చింది. అమ్మాయి అపహరణ, నిర్బంధం, అత్యాచారం వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ డిజిపి దినేష్ రెడ్డిని ఆదేశించింది.

No comments:

Post a Comment