'ప్రిన్స్ మహేష్ బాబు'.. సైలెంట్ గా రికార్డులను, కలెక్షన్లను కొల్లగొట్టడం
ఆయన ప్రత్యేక. అంతే కాదు అమ్మాయిల కలల రాజకుమారుడు. ఈ 'బిజనెస్ మెన్'
'దూకుడు' చూసి అమ్మాయిలతో పాటు హీరోయిన్లు కూడా ఫిదా
అయిపోతారు. ఒక్కసారి
ఇతగాడి సరసన ఆఫర్ వస్తే చాలని కోరుకోని హీరోయిన్లుండరు. అయితే ఈ కోరిక
ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. రీసెంట్ గా
'రాంజనా' బ్యూటీ సోనాక్షి కూడా ప్రిన్స్ తో నటించాలనుకుంటున్నాని
చెప్పింది. ఆమె కాదు ఇప్పడు ఏకంగా మాజీ 'మిస్ ఇండియానే' ప్రిన్స్ కు
పడిపోయిందట. 2008 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న 'సిమ్రాన్ కౌర్'
లేటెస్టుగా ప్రిన్స్ చూపులకు ఫ్లాట్ అయిందట. ఈ బ్యూటీ ప్రస్తుతం ‘పోటుగాడు’
సినిమాతో తెలుగుతెరకు పరిచయం కాబోతోంది. అయితే అందరు హీరోయిన్లలాగే ఈ
ముద్దుగుమ్మ కూడా మహేష్ బాబుతో నటించాలని, ఆయన చాలా హ్యాండ్సమ్ అని
చెబుతోందట. అంతే కాదు మరో స్టెప్ ముందుకేసి ప్రిన్స్ వైఫ్ నమ్రతను కలిసి ఈ
విషయం కూడా చెప్పేసిందట. మరి ఈ బ్యూటీకి మహేష్ పడతాడో లేదో చూడాలి.
No comments:
Post a Comment