ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు ముఖేష్,
పవన్, అక్షయ్, వినయ్ నలుగురినీ సాకేత్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
వీరికి రేపు శిక్ష ఖరారు కానుంది. ఆకృత్యానికి పాల్పడిన ఆరుగురు
నిందితుల్లో ప్రధాన నిందితుడు
రాంసింగ్ మార్చి 11న తీహార్ జైల్లో
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతనికి
కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. 13 సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదైంది.
నిందితులపై విచారణ జరుగుతున్న న్యాయస్థానంలో ఇప్పటి వరకు 130 వాదనలు
జరిగాయి. నలుగురు దోషుల వాదనలు విన్న అనంతరం రేపు వీరికి శిక్ష ఖరారు
చేయనున్నారు. దోషులకు శిక్ష ఖరారుపై రేపు ఉదయం 11 గంటల నుండి వాదనలు
ప్రారంభమవుతాయని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. యావత్ భారత దేశం ఈ
ఘటనను తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అయితే..'ఢిల్లీ అత్యాచార ఘటన'లో నిందితులకు ఉరిశిక్ష వేసినపుడు మాత్రమే
నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె తల్లి డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment