ఉపేంద్ర, సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది జంటగా నటిస్తున్న చిత్రం 'ఎక్స్
వై జడ్'. 'జిఎంఆర్ ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్' పతాకంపై గాజుల మాణిక్యాలరావు
ఈ
చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రవి దర్శకత్వం వహిస్తున్నాడు. శనివారం
హైదరాబాద్ లో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. పాటల సిడిని నటుడు
శివకృష్ణ అవిష్కరించాడు. ఈ సందర్భంగా నిర్మాత మాణిక్యాలరావు మాట్లాడుతూ..''
ప్రసుత్తం వస్తున్న చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. ఉపేంద్ర సినిమాలో
అద్భుతంగా నటించాడు. ఘంటాడి కృష్ణ సంగీతం చాలా బాగుంది. త్వరలో ఈ సినిమాను
ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం''. అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు
రవి, నటులు సుధాకర్, సంజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment