Sunday, September 8, 2013

ఆఫర్ కోసం కోల్డ్ వార్ కాస్త క్లోజ్ అయ్యింది!

బాలీవుడ్ సిస్టర్ ల మధ్య వార్ ఓ కొలిక్కి వచ్చిందట. ప్రియాంక‌చోప్రా, ప‌రిణితిచోప్రాల మ‌ధ్య కోల్డ్ వార్ ఈమధ్యనే క్లోజ్ అయ్యిందని సమాచారం. అయితే దీనికి పెద్ద కారణమే ఉందని బాలీవుడ్ సమాచారం. అ వివరాల్లోకి వెళితే..
రీసెంట్‌గా రిలీజ్ అయిన ప‌రిణితి చోప్రా ఫిల్మ్ 'షుద్ దేశి రొమాన్స్' బాక్సాపీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డింది. దీంతో ప‌రిణితి అప్‌ క‌మింగ్ ప్లాన్స్ కి బ్రేక్ ప‌డింది. దీనికి త‌గ్గట్టుగానే త‌న ప్యూచ‌ర్ ప్లానింగ్స్‌ను రెడీ చేసుకుంది. దీనిలో భాగంగానే ఈ మూవీ హీరోతో సైన్ చేసిన మరో సినిమా నుంచి తప్పుకోవాలని చూస్తోందట.  ఈ సినిమా పోయినా రణబీర్ కపూర్ తో ఓ కొత్త సినిమాకు ప్లాన్ చేసుకుంటోందట ఈ ముద్దుగుమ్మ. ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో ప్రియాంక‌చోప్రాకు మంచి ప‌రిచ‌యాలు ఉండ‌టంతో అక్క పాపులారిటీని చెల్లి వాడుకుంటుందని బాలీవుడ్ అంతా కోడై కూస్తోంది. బాలీవుడ్‌లో చెల్లికి అండగా ఉంటాన‌ని రీసెంట్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చిన ప్రియాంక‌చోప్రా. దీంతో ఈ ఇద్దరి రిలేషన్ పై బాలీవుడ్ లో ముచ్చటగా చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment