Monday, September 9, 2013

కొచ్ఛాడియాన్ 'టీజర్' విడుదల

ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న రజిని అభిమానులకు శుభవార్త వచ్చింది. రజినీ కాంత్ , ప్రయాంకచోప్రా జంటగా నటిస్తున్న
సినిమా 'కొచ్ఛాడియాన్' విడుదలకు సిద్ధమవుతోంది. రజినీకాంత్ కూతురు సౌందర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్ర 'టీజర్' ను వినాయక చవితి సందర్భంగా సౌందర్య రిలీజ్ చేశారు. 'మోషన్ కాప్చర్ టెక్నాలజీ'తో రూపొందిన ఈ చిత్రం తెలుగులో 'విక్రమ సింహ' గా డబ్బింగ్ అవుతోంది. రూ.150కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం తమిళంతో పాటు హిందీ, చైనా, జపాన్, రష్యా వంటి పలు భాషల్లో కూడా డబ్ అవుతోంది. అయితే కొత్త టెక్నాలజీ తో వచ్చిన ఈ చిత్రం 'అవతార్' చిత్రాన్ని తలపిస్తోంది.

No comments:

Post a Comment