Friday, September 6, 2013

మునగాకు స్పెషల్

వర్షాకాలంలో శరీరంలో, ముఖ్యంగా ఉదరంలో జీర్ణప్రక్రియలో జరిగే మార్పులకు మునగాకు మేలు చేస్తుందని అంటారు. అందుకే ఈ కాలంలో
మునగాకు తినాలని చెబుతారు. అయితే ఒక్క ఈ కాలంలోనే కాకుండా ఏడాది పొడవునా మునగాకు తింటే మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కంటికి మేలు చేస్తుంది.

అయితే చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. అందరూ ఇష్టంగా తినేలా వివిధ రకాలుగా తయారుచేసుకోవాలి. రెండు చెంచాల మునగాకు రసం పాలల్లో కలుపుకొని తాగితే రక్తహీనత, క్యాల్షియం లోపం రాకుండా చేయవచ్చు. పొటాషియం వల్ల మెదడు, నరాలు చక్కగా పనిచేస్తాయి. మునగాకులో ఉండే విటమిన్‌ ఎ, సి ఉపయోగాలు అందరికీ తెలిసినవే. 

No comments:

Post a Comment