సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తీయాలంటే ''రామ్ గోపాల్ వర్మ'' తర్వాతే ఎవరైనా అంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు. ఇదే బాటలో తెలుగు దర్శకులు
''రవిబాబు'', సూపర్ స్టార్ కృష్ణ కూతురు ''మంజుల'' తీసిన 'అవును, షో' సినిమాలు ప్రేక్షకులను ఎంతో భయాందోళనలకు గురిచేస్తాయి. ఇలాంటి తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయడం సర్వసాధారణమే. మాటలు, పాటలు లేని సినిమాలను చూశాం. మూడు పాత్రలతో కూడిన సినిమాలు, రెండే పాత్రలతో వచ్చిన సినిమాలు చాలనే వచ్చాయి. ఇప్పుడు కోవకు చెందిన మరో రెండు ప్రయోగాత్మక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఏకపాత్రాభినయంతో రాబోతున్నాయి. తొలిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించేందుకు మరో కొత్త దర్శకురాలు ''సుజాత భౌర్య''ఇండస్ట్రీకి పరిచయం కానుంది.''పంచమి'' టైటిల్ తో వచ్చే ఈ సినిమాలో నటి 'అర్చన' నటించబోతోందట. ఏకపాత్రాభినయంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించబోతోన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకురాలు చెబుతున్నారు. 'చండ్ర మూవీస్' పతాకంపై చండ్ర మధు నిర్మిస్తున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'నయన'. కుమారి 'నటాషా' టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల విడుదలైన ఆడియోతో పాటు ట్రైలర్స్ కి విశేష స్పందన లభించిందని నిర్మాత అన్నారు. చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ ప్రయోగాత్మక సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని ఎక్స్ పర్మెంట్ సినిమాలు రూపుదిద్దుకుంటాయనేది మాత్రం నిజం. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఈ రెండు సినిమాల సక్సెస్ పైనే ఆధారపడి ఉంది.
No comments:
Post a Comment