Friday, September 6, 2013

పండ్లతో చర్మ రక్షణ ఎలా అంటే..

  • యవిటమిన్‌ ఎతో కూడిన బొప్పాయి పండు గుజ్జును ముఖానికి పట్టిస్తే మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.


  • యఆపిల్‌ పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆపిల్‌ గుజ్జును కూడా ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంలోని క్రిములు నశిస్తాయి.
  • యబత్తాయి రసంలో ఉన్న విటమిన్‌-సి వల్ల జిడ్డు చర్మానికి చెక్‌ పెట్టేయవచ్చు. ఇక కమలా, జామ పండ్లలో సి విటమిన్‌ ఉంటుంది. ఈ పండ్ల గుజ్జును ముఖానికి రాస్తే, అది మీ చర్మం నిగనిగా మెరిసేలా చేస్తుంది.
  • యఏ సీజన్లోనైనా లభించే అరటిపండు కూడా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండుతో వేసిన ప్యాక్‌తో ముఖంపై ముడతలు మటుమాయం అవుతాయి.
  • యసీజనల్‌గా దొరికే పండ్లు చౌకగా ఉంటాయి. పండ్లు తింటే మీ చర్మంపై మెరుపు అలాగే నిలిచిపోతుంది. ఆరోగ్యంగానూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment