వందేళ్ల భారతీయ సినీ వేడుకల్లో భాగంగా మలయాళ చిత్ర పరిశ్రమ వేడుకలు సోమవారం
ఘనంగా జరిగాయి. చెన్నైలో జరుగుతున్న ఈ వేడుకలకు కేంద్రమంత్రి వయలార్ రవి
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులతో పాటు, మలయాళ
సూపర్ స్టార్ మమ్ముట్టి, మోహన్ లాల్ , కమల్ హాసన్, నటీమణులు అంబిక, రాధా,
రోహిణి, అభిరామి ఊర్వశి, సుహాసిని, మాధవి, రేఖ, కార్తిక, గాయని చిత్ర,
షీలా, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు హాజరయ్యారు. మలయాళ వందేళ్ల సినిమా
వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి వయలార్ రవికి, సి. కళ్యాణ్ జ్ఞాపికను
అందజేశారు. మలయాళ హీరో మమ్ముట్టి అలనాటి నటీమణి శారదను ఆత్మీయ ఆలింగనం
చేసుకున్నారు. హీరో మోహన్ లాల్ ఓమనకుట్టితో పాటు పలువురికి
అవార్డులనందజేశారు. ఈ వేడుకల్లో మలయాళ నటీనటులు చేసిన సాంస్కృతిక
కార్యక్రమాలు, డ్యాన్సులు, ఆటలు, పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి.

No comments:
Post a Comment