'చందవోలు శోభారాణి' ప్రధాన పాత్రలో 'కృష్ణ', 'ముని చంద్ర', 'యామిని',
'చాణక్య' ఇతర పాత్రల్లో నటిస్తున్న చిత్రం '' జై బోలో సమైక్యాంధ్ర''.
'లక్ష్మణ్ పూడి' డైరెక్ట్ చేస్తున్న
ఈ చిత్రాన్ని అక్టోబర్ 2నుంచి ప్రారంభం
కానుంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ సినిమా వివరాలు సోమవారం మీడియాతో
వెల్లడించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో నెలకొన్న
సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసినిమాను తీస్తున్నాం. దీనిలో రాష్ట్రం
విడిపోతే ఎన్ని కష్టాలు ఉంటాయి. కలిసి ఉంటే వచ్చే లాభాలేంటి అని
చూపించబోతున్నాం. ఈ సినిమా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అక్టోబర్ 2
నుంచి ప్రారంభిస్తాం'' అన్నారు. నటి కవిత మాట్లాడుతూ.. ' కొన్ని
రాజకీయపార్టీలు తమ స్వార్థ రాజకీయాలకోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని
ప్రయత్నాలు చేస్తున్నాయి. అందరూ కలిసి కట్టుగా ఉండాలని సినిమా ముఖ్య
ఉద్దేశ్యం.''అన్నారు.
No comments:
Post a Comment