Tuesday, September 3, 2013

ఒక్క ఛాన్స్ ప్లీజ్..!

ఇప్పుడు చతికిలపడ్డారు. తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన అందాల భామలు ఇప్పుడు ఛాన్స్ ల కోసం పడితపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లినా.. వారి జాతకంలో మార్పులేదు. అడపాదడపా ఒకటో రెండో ఛాన్స్ లు వచ్చినా..
అవి వారి భవిష్యత్ కు బాటగా మారడం లేదు. ప్రతి సారి ఆఫర్ల కోసం వేచిచూడాల్సి వస్తుంది. టాలీవుడ్ ను ఏలిన ఈ అందాల భామలు దర్శకులు చుట్టూ.. నిర్మాతల, హీరోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సినిమా ఆఫర్లకోసం ప్రాదేయపడుతున్నారు.
దీనికి కారణం ఈ టాలీవుడ్ హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ పెంచేయడం.. ఇది కాదని పక్క ఇండస్ట్రీలోకి వెళ్లడం. అయితే టాలీవుడ్ లో ఉన్నప్పుడు అవకాశాలు బాగా వచ్చాయి. వీరు తమ అందానికి తగ్గట్టు, నటన విషయంలో అందరిని ఆకర్షించారు. దీంతో ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వీరు నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఒక్కసారి వారి పారితోషికం భారీగా పెంచేశారు. దీనివల్ల వీరిని సినిమాలకు తీసుకోవాలంటేనే నిర్మాతలకు చెమటలు పడుతున్నాయి. ఈ భామలకు సరిపడా పారితోషికం ఇచ్చుకోలేక వీరినే పక్కన పెట్టేశారు మన దర్శకనిర్మాతలు. అయితే మొదట వీరు రూ.లక్షల్లో మాత్రమే పారితోషికం తీసుకునే వారు. దీంతో ఆఫర్లు బాగానే వచ్చాయి. కాని ఇప్పుడు టాప్ హీరోయిన్లు కనీసం అరకోటికి తగ్గకుండా తీసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా కోటి నుంచి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. సమంత, నయన్, అనుష్క, కాజల్, తమన్నా, శ్రియ, ఛార్మి, తాప్సీ తారలు కూడా కోటికి పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే సమంత, నయన్, అనుష్కలకు భారీగానే ఆఫర్లు వస్తున్నా.. మిగతా వారికి మాత్రం ఛాన్స్ దొరకడమే భాగ్యంగా మారింది. సరైన అవకాశాలు లేక వీరు ఒక్క అఫర్ ప్లీజ్ అంటూ దర్శకుల, నిర్మాతల వెంట పడుతున్నారు. ఒకప్పుడు నెం1 హీరోయిన్లుగా కొనసాగిన ఈ తారామనులు ఇప్పుడెక్కడున్నారు? ప్రస్తుతం వీరి పరిస్థితి ఎంటో మన ట్రెండ్ గురులో తెలుసుకుందాం..
కాజల్..
   టాలీవుడ్ నెం1 హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది 'కాజల్'. అందం, అభినయంతో ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసింది ఈ 'చందమామ'. మగధీర సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ సంపాధించుకున్న ' మిత్రవింద', ఆ తర్వాత టాప్ హీరోలందరితో కలిసి యాక్ట్ చేసింది. సూపర్ హిట్స్ తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న టైంలోనే సింగంతో బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంది కాజల్. ఇక 'బీ టౌన్'లో బంపర్ హిట్ కొట్టగానే కాజల్ టాలీవుడ్ ని నెగ్లెట్ చేసింది. రెండు హిట్స్ రావడంతో బాలీవుడ్ లో ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్న కాజల్ కి ఆతర్వాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దాంతో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. కానీ అక్కడ కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది.
బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తెలుగు సినిమాలని నెగ్లెట్ చేసిన కాజల్ కి ఇప్పుడు టాలీవుడ్ షాక్ ఇస్తోంది. టాప్ హీరోయిన్ని చేసిన తెలుగు సినిమాని నిర్లక్ష్యం చేయడంతో, తెలుగు దర్శకులు కూడా కాజల్ కి ఆఫర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారట. ఇక అసలే అవకాశాలు లేక రిటైర్ మెంట్ స్టేజ్ కి దగ్గరపడ్డ కాజల్ కి పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2తో, కమల్ హాసన్ కొత్త సినిమాలో ఆఫర్ ఇచ్చినా రెమ్యురేషన్ రేంజ్ పెంచి వచ్చిన రెండు సినిమాలను కాదనుకొని ఖాళీ గా ఉంది బ్యూటీ. ఖాళీగా అయినా ఉంటాను గానీ, రెమ్యునరేషన్ లో రూపాయి కూడా తగ్గించను అని ప్రొడ్యూసర్లకి చుక్కలు చూపిస్తోంది ఈ భామ.
తమన్నా..
  
బ్యూటిఫుల్ లుక్స్ తో టాలీవుడ్ హీరోలందరిని ఫిదా చేసిన అందాల తార 'తమన్నా'. బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా, అక్కడ ఆఫర్స్ అందుకోలేకపోయింది. తర్వాత 'శ్రీ' మూవీతో టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. కానీ 'శ్రీ' కూడా శుభం చేకూర్చకపోవడంతో తమ్మూ బేబి హిట్ కోసం కోలీవుడ్ కి ప్రయాణం కట్టింది. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. సరిగ్గా ఆ టైంలోనే తమన్నాకి ' హ్యాపిడేస్' తో ఓ గోల్డెన్ ఆఫర్ వచ్చింది. శేఖర్ కమ్ముల రూపంలో తమ్మూకి ఫస్ట్ సక్సెస్ వచ్చింది. దాంతో తమన్నా స్టారే మారిపోయింది. బ్యూటిఫుల్ డాన్స్ లతో, మెస్మరైజ్ చేసినా ఈ అమ్మడు 'బీ టౌన్ ను షేక్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయింది. వెంటనే అలనాటి సూపర్ హిట్ ఫిల్మ్ 'హిమ్మత్ వాలా' రీమేక్ తో బీటౌన్ ఎంట్రీ ఇచ్చింది. గ్లామరస్ యాక్టింగ్ తో రిలీజ్ కి ముందే ముంబై బాబులని ఫిదా చేసింది ఈ మిల్కీ బ్యూటీ. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు కాల్షీట్ ఖాళీ లేదని ఐయామ్ వెరీ బిజీ అని ఫోజ్ కొట్టిన తమ్మూ.. ఇప్పుడు ప్లీజ్ ఒకే ఒక ఆఫర్ అంటూ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. కానీ చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత అన్నట్లు మిల్కీ బ్యూటీకి ఆఫర్స్ కూడా ఐయామ్ సారి అన్నాయి.
తాప్సీ, నిత్యమీనన్, త్రిష, శ్రియా, ఛార్మి..
 టాలీవుడ్ మోస్ట్ లక్కీ హీరోయిన్ తాప్సీ. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటికూడా సరైన హిట్ లేని తాప్స్, ఎలాగోలా నాలుగైదు సినిమాలు చేసింది. గ్లామర్ వల్లనో, టాలెంట్ వల్లనో కోలీవుడ్, బాలీవుడ్ ల్లో కూడా సినిమాలు చేసిందీ ఢిల్లీ బ్యూటీ. బట్ ఏ వుడ్లో సినిమా చేసినా హిట్ మాత్రం చాలా దూరంగా ఉండిపోయింది. దాంతో తాప్సీకి 'ఐరన్ లెగ్' అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయ్యింది. ఇక తెలిసిన వాళ్లందరినీ ఒక్క ఆఫర్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుకుంటుందట. మరి ఈ ప్లీజ్ లు తాప్సీకి అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో.. చూడాలి.
   చిన్న సినిమాలతో, పెద్ద హిట్స్ అందుకున్న హీరోయిన్ నిత్యామీనన్ పరిస్థితి కూడా అలానే ఉంది. రెమ్యూనరేషన్ తో పట్టింపు లేకపోయినా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే యాక్ట్ చేస్తుండడంతో ప్రొడ్యూసర్స్ ఈ మళయాలి భామ గురించి ఆలోచించడమే మానేశారట. 'త్రిష' ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసి అందరిని ఆకర్షించింది. కాని ఇప్పుడు ఆఫర్లు లేక సైలెంట్ అయిపోయింది.
   ఇక సీనియర్ హీరోయిన్లైన శ్రియా, ఛార్మి కూడా ఆఫర్స్ కోసం వెతుకులాటలు మొదలుపెట్టారు. ఇద్దరూ వేశ్య పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి, మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్లాన్ వేశారు. బట్ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో ఈ భామల కలలు గల్లంతయ్యాయి. మరి వీళ్లు మళ్లీ హీరోయిన్ గా ఫామ్ లోకి రాగలరా అంటే చెప్పడం చాలా కష్టమనే చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు.
  సాధారణంగా కొత్త టాలెంట్ వస్తుంటే పాత టాలెంట్ ప్రాధాన్యత తగ్గుతుంది. అంతేకానీ అది కనుమరుగైపోదు, బట్ టాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం చాలా త్వరగా తెరమరుగైపోతున్నారు. ఈ టాలీవుడ్ భామలకు రెమ్యూనరేషన్ పై ఉన్న ఆసక్తి ప్రొఫెషన్ పై లేకపోవడం వల్లనే ఇప్పటి హీరోయిన్స్ సినీ కెరీర్ కి త్వరగా ఎండ్ కార్డ్ పడిపోతుందని సినీ విమర్శకులు అంటున్నారు. సో ఇప్పటికైన ఈ అగ్రతారలు తమ ప్రొఫెషన్ పై దృష్టి పెట్టి మళ్లీ తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ట్రెండ్ ను సెట్ చేస్తారని ఆశిద్దాం..

No comments:

Post a Comment