Tuesday, September 3, 2013

'సింహాలు' వస్తాయా..?


టాలీవుడ్ టాప్ హీరోలు ఒకేసారి వస్తున్నారు. ఇప్పటి వరకు చిన్న సినిమాలు వచ్చాయి కానీ ఈ నెలలో ఒకేసారి మూడు సింహాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని జింకలను చూస్తే ఏం.. ఓ పులిని చూసినప్పుడుండే ఎక్సైట్ మెంట్ ఉండదు కదా. అలాగే చిన్న సినిమాలు ఎన్ని వచ్చినా పెద్ద హీరోల అభిమానుల హడావిడీయే వేరు. వాటిలో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేదీ' ఒకటి. దీని కోసం పవన్ అభిమానులంతా 'ఈగర్' గా ఎదురు చూస్తున్నారు. సీమాంధ్రలో సాగుతోన్న ఉద్యమంతో పోల్చుకుంటే అత్తారింటికి ఆదరణ రావడం మాత్రం డౌటేనంటున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. అందుకే నిర్మాత ధైర్యం చేసినా డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. మరి ఈ నెల 19న విడుదల చేస్తామని చెబుతున్న అత్తారింటికి దారేదీ వస్తుందా అని ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక రామ్ చరణ్ 'ఎవడు' కూడా అక్టోబర్ 9న వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఈ సినిమాకు కూడా పవన్ సినిమా లాగే ఉద్యమ సెగ తాకే అవకాశం ఉందని టాక్. అయితే ఈ లోగా రామ్ చరణ్ తుఫాన్ ఉండటంతో ఒకవేళ ఈ గొడవలన్నీ ఆ తుఫాన్ లో కొట్టుకుపోయి, సినిమాలకు కాస్త సడలింపు ఇస్తే మిగతా స్టార్ హీరోలంతా బతికిపోయినట్టే.
  ఇక రెండు ప్రాంతాల వారికీ అర్థం కాకుండా ఉంది 'ఎన్టీఆర్' పరిస్థితి. తన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాను రెండు ప్రాంతాల్లో అడ్డుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఏం జరిగినా ఈ నెల 27న విడుదల చేయాల్సిందేనని నిర్మాతకు చెప్పేశాడు ఎన్టీఆర్. ఈ నెల 8న రామయ్యా వస్తావయ్యా ఆడియో విడుదల కానుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ మూడు సినిమాలు విడుదల తేదీలు ప్రకటించినా.. విడుదలవుతాయా..? అనే సందేహం వారి అభిమానుల్లో కల్గుతోంది. సో ఇవి విడుదలవుతాయా.. లేదా అనేది వేచి చూడాలి.

No comments:

Post a Comment