Tuesday, September 3, 2013

నెట్ లో హల్ చల్ చేస్తున్న కొత్త 'యాప్'

హైదరాబాద్: ప్రస్తుతం ఇంటర్నెట్ లో రకరకాల అప్లికేషన్లు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ' బాయ్ ఫ్రెండ్ ట్రాకర్' పేరుతో వచ్చిన ఒక అప్లికేషన్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇలాంటి గూఢాచారపు యాప్స్ వందల సంఖ్యలో ప్రస్తుతం అందుబాటులో
ఉన్నాయి. విండోస్‌, ఐపాడ్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్ తో పని చేసే ఫోన్స్ కు మాత్రమే నిన్న మొన్నటి వరకు ఇలాంటి అప్లికేషన్లను వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం సాధారణ వెయ్యి రూపాయల ఫోన్‌లో కూడా వాడుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో రకరకాల యాప్స్ వాడకంలోకి వచ్చాయి. ఒక్కసారి ఫోన్‌లో 'బాయ్ ఫ్రెండ్ ట్రాకర్' యాప్ ను ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు మనం సెల్‌తో ఏం చేసినా అవతలి వ్యక్తికి తెలిసిపోతుంది. ఎస్‌ఎమ్మెస్‌లు, ఇన్‌ కమింగ్‌ కాల్స్, అవుట్‌ గోయింగ్‌ కాల్స్, ఫోటోస్‌, చాటింగ్‌ అన్నీ యాప్ ను ఇన్‌స్టాల్‌ చేసిన వారికి తెలిసిపోతాయి. ఇంకా చెప్పాలంటే మనకొచ్చే ఫోన్‌ని కూడా ఆ వ్యక్తి ఆపరేట్‌ చేయొచ్చు. మనం ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎవర్ని కలిసింది ఇలాంటి సమాచారాన్ని అందించే ఇటువంటి యాప్స్ సమాజ శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే మంచిదని కొందరి భావన. లేదంటే దీని వల్ల మంచికంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రెజిల్‌లో నానా రాద్ధాంతం సృష్టించిన ఇటువంటి ఒక యాప్‌ని గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. కానీ ఇలాంటి వందల యాప్స్ ఇంటర్నెట్‌లో ఇంకా ఉన్నాయి. వీటిని ఎవరు వాడుతున్నారో ఎవరి పోన్‌లో ఇన్ స్టాల్‌ చేశారో కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. టెక్నాలజీని క్రమంగా ఉపయోగిస్తే ఎంత మంచి ఫలితాలు వస్తాయో, చెడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అంత చెడు జరుగుతుందని సాఫ్ట్ వేర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

No comments:

Post a Comment