మహేష్ తో జతకట్టి క్రేజీ హీరోయిన్ అనిపించుకోవాలని చాలా మంది హీరోయిన్లు ఆశపడుతుంటారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంతా మహేష్ తో ఆడిపాడిన వారే. గోవా సుందరి ఇలియానా, సమంత, కాజల్ వంటి హీరోయిన్లు ప్రిన్స్ తో జత కలిసిన వారే. ఇక వీరు తప్ప మరే హీరోయిన్ టాలీవుడ్ హీరోలతో నటించే వారు లేరట. ప్రస్తుతం స్టార్ హీరోలకు రిపీట్ కాంబినేషన్సే దిక్కు అవుతున్నాయి. సమంతా తప్ప మిగిలిన వారి పనయిపోయిందనేది ఫిల్మ్ నగర్ టాక్.. ఇదే సందర్భంలో 'వైజయంతీ మూవీస్' పతాకంపై అశ్వినీదత్ నిర్మించే 'శివం'లో ప్రిన్స్ సరసన బాలీవుడ్ బ్యూటీ 'సోనాక్షీ' జతకడుతున్నట్లు అప్పట్లో వార్తలు హాల్ చల్ చేసాయి. క్రిష్ దర్శకత్వంలో రాబోయే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు కానీ సోనాక్షి కాంబినేషన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కి మంచి క్రేజ్ ని తీసుకొచ్చిందని టాక్.
ఇక 'అనీల్ కపూర్' ముద్దుల తనయ 'సోనమ్ కపూర్' కూడా మహేష్ తో అయితే ఓకే అంటుంది. ఇప్పటికే ధనుష్ తో రాంజానా తో హిట్ కొట్టి.. 'భాగ్ మిల్కా భాగ్' సక్సెస్ లతో కెరియర్ ని గాడిలోకి పెట్టుకుంటున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సో... వీరి కాంబినేషన్ త్వరలో తెరపైకి వచ్చే అవకాశం ఉందట. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఆడ్స్ తోనూ కాకుండా ఇలాంటి ప్రపోజల్స్ తో కూడా ముంబై మార్కెట్ లో ప్రిన్స్ పేరు చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం 'వన్' నేనొక్కడినే కోసం ఢిల్లీ మోడల్ కృతి సనన్ తో రోమాన్స్ చేస్తున్న ప్రిన్స్ త్వరలో మరో బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకి పరిచయం చేస్తాడని సమాచారం. సో ఆ రేర్ కాంబినేషన్ ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.

No comments:
Post a Comment