రజనీకాంత్.. ఇండియన్ సూపర్ స్టార్. తన నటన, స్టైల్ తో దూసుకుపోతున్న హీరో. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులల్లో క్రేజ్ ఉన్న ఇండియన్ స్టార్. అయితే ఈ సూపర్ స్టార్ పై బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ రషీద్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశాడు. సూపర్ స్టార్ కు ఏమాత్రం సరితూగని నటుడు ఆయనపైనే కామెంట్ పంపడంపై సినిమా ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యానికి గురయ్యింది. అయితే ఈ కామెంట్స్ కమల్ రషీద్ తన 'ట్విట్టర్'లో పోస్ట్ చేశాడట. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటనుకుంటున్నారా.. ''రజనీ అందగాడైన సూపర్ స్టారా..? లేక అత్యంత అసహ్యంగా కనిపించే సూపర్ స్టారా..'' అంటూ తీవ్రంగా కమెంట్ చేశాడు. ఇది ట్విట్టర్ లో అన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే.. సినిమా రంగంలోనే ఇది పెద్ద దూమరమే జరిగి ఉండేదని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయం రజినీ అభిమానులకు తెలిస్తే.. ఈ బాలీవుడ్ నటుడికి చుక్కలు చూపించే వాళ్లని ఫిల్మ్ నగర్ సమాచారం.
మనవాడు పబ్లిసిటీ కోసం ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీయల్ కమెంట్స్ చేస్తుంటాడు. గతంలో కూడా ధనుష్ పైకూడా రషీద్ ఇలాంటి విమర్శలే చేశాడు. అప్పుడు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే పెద్దగా తెలియలేదు. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

No comments:
Post a Comment