Friday, September 27, 2013

కథాబలంతోనే హిట్ సాధ్యం: డి. ప్రసాద్..

కథాబలంతో వచ్చిన సినిమా కచ్చితంగా హిట్ సాధిస్తాయని చెబుతున్నాడు.. ' అంతకు ముందు.. ఆ తర్వాత' చిత్ర నిర్మాత. కుటుంబ కథా చిత్రాన్ని అందించిన నిర్మాత దామోదర ప్రసాద్. ఇక ముందు తమ సంస్థ నుంచి రాబోయే అన్ని సినిమాలూ
కథాబలం ఉన్నవే వస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా విడుదలయి సక్సెస్ సాధించిన సందర్భంగా ఆయన తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. '' ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ప్రేక్షకుల్లో మంచి టాక్ తో పాటు కలెక్షన్లలో కూడా భారీగానే రాబట్టగలిగింది. ఈ ఉత్సాహంతో మరో రెండు సినిమాలు తీస్తున్నాను. వాటిలో ముఖ్యంగా కథదృష్టిలో పెట్టుకొని నిర్మిస్తాము'' అని అన్నారు.

No comments:

Post a Comment