దాసరి నారాయణ రావు టాలీవుడ్ దర్శకరత్నగా పేరుతెచ్చుకున్న ఓ లెజెండ్. ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ గురించి వందేళ్ల సినిమా పండుగలో ప్రశంసించ లేదు. ఇతనే కాక చిరంజీవి వంటి చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఈ వేడుకల్లో
పాల్గొనలేదు. కనీసం వారిని ఈ వేడుకల్లో స్మరించుకున్న పాపాన పోలేదు. ఇలా అనేక మందిని అవమాన పరిచిన ఉత్సవాలకు వెళ్లకపోవడమే బెటర్ అని అంటున్నారు సినీ విమర్శకులు. అయితే దాసరి, చిరంజీవి రాకపోవడానికి కారణం మోహన్ బాబేనట. ఈ వేడుకలకు ముందే మోహన్ బాబు వందేళ్ల ఉత్సవాలను బహిష్కరించాలని వ్యాఖ్యానించాడు. దీనికి బలం చేకూరే లాగా అక్కడ నిర్వహణ లోపాలు కూడా కనిపించాయి. దీంతో మన స్టార్లు చెన్నయ్ లో జరిగిన వేడుకలకు హాజరు కాలేదు. మోహన్ బాబు కోసమే వీరు వేడుకల్లో పాల్గొనలేదని టాలీవుడ్ టాక్. అయితే ఇందులో మరో ట్విస్టు ఉంది. తన కామెంట్స్ తో తెలుగు పెద్దలకు ఉత్సవాల్లో పాల్గొనకుండా చేసిన మోహన్ బాబు తన కుమారులు, కూతురుని అదుపుచేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ వేడుకల్లో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ హాజరై తెగ ఎంజాయ్ చేశారు. సో దీంతో ఈ డైలాగ్ కింగ్ పరిస్థితి డైలామాలో పడింది. వీధిలో పులిలా.. కామెంట్స్ చేసే మోహన్ బాబు ఇంట్లో మాత్రం పిల్లే అని విమర్శస్తున్నారు సినీ జనాలు.
No comments:
Post a Comment