Sunday, September 8, 2013

తాడోపేడో ఇక తేల్చుకోక తప్పదు

తాడోపేడో ఇక తేల్చుకోక తప్పదు అంటున్నాడు 'పవన్ కళ్యాణ్'. ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని రిస్క్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వడ్డీకి తెచ్చి
సినిమా తీశాడు నిర్మాత బిఎస్ విన్ ప్రసాద్. ఇంకా ఆలస్యం చేస్తే ఆ వడ్డీ పెరిగిపోయి తర్వాత సినిమా చేయడానికి చేతులెత్తేస్తాడని ఫీలవుతున్నాడట. అందుకే ఇక 'అత్తారింటికి' వెళ్లేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నాడట పవన్. ఉద్యమాలు జరుగుతున్నాయని ఊరుకుంటే అసలుకే మోసం వస్తుందనుకుంటున్నారట. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు కు ఇలాంటి ఇబ్బందే ఎదురైనా అంతగా నష్టం ఏమి కలుగలేదంటున్నారు. ఇక ఈ సినిమాను కూడా అన్నీ కుదిరితే ఈ నెల 19 లేదా 20న కచ్చితంగా విడుదలవుతుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి ఈ వార్తలు రెండు ప్రాంతాలపై ఏ ప్రభావం చూపుతాయో కానీ పవన్ మాత్రం తాడో పేడో తేల్చుకోవాలనే డిసైడ్ అయ్యాడట.

No comments:

Post a Comment