Sunday, September 8, 2013

'సోనీ' కంపెనీ పవర్ ఫుల్ కెమెరా

'ది పవర్ ఆఫ్ ఇమేజింగ్ మేక్.. బిలీఫ్'.. అంటూ సోనీ కంపెనీ పవర్ ఫుల్ కెమెరా రూపొందించింది. ఈ ఆల్ఫా సిరీస్ లోనే సోనీ ఇప్పుడు మరో ఎక్స్ ట్రార్డినరీ కెమెరాని ఇంట్రడ్యూస్ చేస్తోంది. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్
స్టైల్ లో సోనీ కంపెనీ న్యూ రేంజ్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేస్తోంది. సోనీ బ్రాండ్ ఆల్ఫా సిరీస్ లో వస్తోన్న దీని మోడల్ నేమ్ ఆల్ఫా3000. మిర్రర్ లెస్ ఇంటర్ ఛేంజబుల్ లెన్స్ ఈ కెమెరా స్పెషాలిటీ. 20MP APS-C సైజ్ CMOS సెన్సార్, బయోన్జ్ ఇమేజ్ ప్రాసెసర్, 25 ఫోకస్ పాయింట్స్ ఈ క్యామ్ లోని ఎక్స్ ట్రా ఫీచర్స్. ISO 16,000, RAW సపోర్ట్, HDMI పోర్ట్స్ కూడా ఈ కెమెరాలో ఉన్నాయి. 3 ఇంచ్ ఫిక్స్ డ్ LCD డిస్ ప్లే, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్, బిల్ట్ ఇన్ ఫ్లాష్ లాంటివి ఇందులోని కామన్ ఫీచర్లు. 18-55mm లెన్స్ ఇన్ క్లూడ్ అయి ఉన్న ఈ క్యామ్ తో ఫుల్ HD వీడియోలు తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మార్కెట్లోకి రాబోతున్న దీని ధర సుమారు 25,000 రూపాయలు.
డెల్ ఏలియన్ వేర్ 17
మీరు గేమింగ్ లవర్సా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఎక్స్ క్లూజివ్ గా గేమర్స్ కోసం డెల్ స్పెషల్ ల్యాప్ టాప్స్ ఎప్పటి నుంచో తయారు చేస్తోంది. లేటెస్ట్ గా ఏలియన్ సిరీస్ లో మరో ల్యాపీని మార్కెట్లోకి తెచ్చింది డెల్. అదే డెల్ ఏలియన్ వేర్ 17. 3.4 గిగా హెడ్జ్ ఫోర్త్ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఉన్న ఈ ల్యాప్ టాప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ ఒన్.. స్పెషల్లీ ఫర్ గేమింగ్ లవర్స్.. 8 GB DDR3 RAM, 750 GB హార్డ్ డ్రైవ్ ఉంటుంది. 2 జీబీ డెడికేటెడ్ మెమరీ nvidia ge-force 765 M గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంటుంది. 8 సెల్ బ్యాటరీ ఈ ల్యాపీ లోని స్పెషల్ ఫీచర్లు. 1600 బై 900 పిక్సెల్స్ రెజల్యూషన్ తో ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఆనొడైజ్డ్ అల్యూమినియమ్ మెగ్నీషియమ్ ఎలాయ్ బాడీ తో చూడడానికి చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది. 10 ప్రోగ్రామబుల్ లైటింగ్ జోన్స్, బ్యాక్ లైట్ కీబోర్డ్, ట్రాక్ పాడ్, మల్టిపుల్ పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీని ధర 1,29,990 రూపాయల నుంచి మొదలవుతుంది.
మినియమ్ కీ బోర్డ్
స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్... టచ్ స్ర్కీన్ ఏదైనా క్వెర్టీ కీబోర్డ్ కామన్. నాలుగు వరుసల్లో ఉండే ఆ ఇంగ్లీష్ లెటర్స్ ని టైప్ చేయడంలో బోర్ గా ఫీలైన వారి కోసం ఇప్పుడు మరో స్టైల్ కీబోర్డ్ వచ్చేసింది. అదే మినియమ్ కీబోర్డ్. ఎన్నో సంవత్సరాలుగా కంప్యూటర్ క్వెర్టీ కీబోర్డ్ కి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు నడుస్తున్నది యాప్ ఎరా. చాలామంది డెవలపర్స్ దీన్ని ఛేంజ్ చేయడానికి ట్రై చేశారు. దాని ఫలితంగానే మినియమ్ కీబోర్డ్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ కీబోర్డ్ లో ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ ఒకే వరుసలో ఉండడం దీని స్పెషాలిటీ. నెంబర్స్ కింది రోలో ఉంటాయి. కానీ ఇవీ మొదటి రోలోనే ఉన్నట్లు కనిపిస్తాయి. రెగ్యులర్ టైపింగ్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు దీని మీద టైప్ చేయడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. కొత్త వారికి కూడా ఈ కీబోర్డ్ కంఫర్ట్ గా అలవాటవుతుంది. కీబోర్డ్ మీద ఫింగర్ ఒక దగ్గర పెట్టగానే క్వెర్టీ కీబోర్డ్ లో ఉండే దాని కింది లెటర్స్ కూడా హైలైట్ అవుతాయి. ఈ కీబోర్డ్ టైపింగ్ లో ఆటో కరెక్షన్ ఆల్గారిథమ్ కూడా ఉంటుంది. బెటా వెర్షన్ అందుబాటులో ఉన్న ఈ యాప్ 3.99 యూఎస్ డాలర్లకు లభిస్తోంది. అందరికీ అందుబాటులో ఉండడం కోసం తక్కువ ధరలో కూడా దీన్ని రూపొందిస్తున్నారు.
ఫొటోగ్రఫీ కోర్స్ డాట్ నెట్
ఫొటోగ్రఫీ బేసిక్స్ నేర్చుకోవాలంటే photographycourse.net సైట్ ను క్లిక్ చేయండి. ఫొటో గ్రఫీ ఎక్విప్ మెంట్, ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్, ప్రొఫెషనల్స్ ఆర్టికల్స్ ఇందులో మీకు చాలా దొరుకుతాయి. రకరకాల కోర్సులు, కెమెరాల కంపారిజన్, వర్క్ షాప్స్ కు సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. ఫొటోగ్రఫీకి సంబంధించిన మరో వెబ్ సైట్ photo.net. ఇందులో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫోరమ్స్, గ్యాలరీ, ఫొటో షేరింగ్, కమ్యూనిటీలతో పాటు మీ ఫొటోలకు రివ్యూస్ కూడా లభిస్తాయి. స్పెషల్ బ్లాగ్ లో ఫొటోగ్రఫీ అప్ డేట్స్ కూడా పొందొచ్చు.
డీపీ రివ్యూ డాట్ కామ్
మోస్ట్ పాపులర్ డిజిటల్ ఫొటో రివ్యూ లిస్ట్ కావాలంటే dpreview.com కు లాగ్ ఇన్ అవ్వాల్సిందే. మీరు ఎలాంటి కెమెరా చూజ్ చేసుకోవాలో ఈ వెబ్ సైట్ లో డీటెయిల్డ్ గా ఉంది. రకరకాల కెమెరాలతో తీసిన శాంపిల్ ఇమేజెస్ కూడా దొరుకుతాయి.
కుకింగ్
కుకింగ్ అంటే జస్ట్ ఇన్ గ్రిడియంట్స్ ను కలపడం మాత్రమే కాదు. అదొక ఫైన్ ఆర్ట్. ఎన్నో వందల ట్రిక్స్, వేల టెక్నిక్స్ ను ఫాలో అయితేనే మాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లక్కిలీ ఇప్పుడు మీరు పర్ ఫెక్షన్ కోసం ఎంతో కాలం వెయిట్ చేయనవసరం లేదు. సింపుల్ గా ఈ వెబ్ సైట్స్ క్లిక్ చేస్తే చాలు.
సింప్లీ రెసిపీస్ డాట్ కామ్
కుకింగ్ బేసిక్స్, యూజ్ ఫుల్ టిప్స్ కావాలంటే జస్ట్ Simply recepies.com క్లిక్ కొడితే చాలు. ఈ సైట్ లో ఫ్రీ యాప్ ఫెసిలిటీ ను ఆఫర్ చేస్తున్నారు. Reluctant gourment.com కూడా ఇలాంటి కుకింగ్ వెబ్ సైటే. how to cook అనే మెనూ మీకు రోస్టింగ్, గ్రిల్లింగ్, ఫ్రైయింగ్, బేకింగ్ గురించి ఎన్నో విషయాలు చెబుతుంది.
ఆర్టిస్టిక్ స్కిల్స్
మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలంటారు కదా... అందుకే ఆర్టిస్టిక్ స్కిల్స్ పై ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళ కోసం స్పెషల్ సైట్స్ చాలా ఉన్నాయి. బేసిక్ కలర్స్, డ్రాయింగ్ టెక్నిక్స్ కోసం ఆర్ట్ ఫ్యాక్టరీ.com చాలా హెల్ప్ అవుతుంది. లెసన్స్, ఆర్టికల్స్, వీడియోస్ ద వర్చ్యువల్ ఇన్ స్ట్రక్టర్.comలో దొరుకుతాయి. ఇన్ స్ట్రక్టబుల్స్ డాట్ కామ్ లో వాటర్ మిలాన్ కర్వింగ్, జ్యువెలరీ మేకింగ్, పప్పెట్స్ మేకింగ్, కస్టూమ్స్ డిజైనింగ్ లాంటివి నేర్చుకోవచ్చు.
సెల్ఫ్ డిఫెన్స్
సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఏ మాస్టర్ దగ్గరకో, ప్రొఫెషనల్ దగ్గరకో వెళ్లనక్కర్లేదు. సింపుల్ గా ఒక్క మౌస్ క్లిక్ తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు. లైఫ్ హాకర్ డాట్ కామ్ ఆన్ లైన్ లో బేసిక్ సెల్ప్ డిఫెన్స్ నేర్చుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్. ఎటాకింగ్ టిప్స్, పంచ్, స్ట్రోక్స్, బేసిక్ కిక్స్ లాంటివి ఇందులో చాలా దొరుకుతాయి.
డ్యాన్సింగ్
దీని గురించి తెలుసుకోవాలంటే సింపుల్ గా చదివితే సరిపోదు. చదవడం కన్నా చూస్తూ దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వేరియస్ డాన్స్ లు, ట్యుటోరియల్ వీడియోల కోసం బెస్ట్ అండ్ మస్ట్ గా చేయాల్సింది యూ ట్యూబ్ చూడడం అని వేరే చెప్పాక్కర్లేదు. డిఫరెంట్ డ్యాన్సింగ్ స్టైల్స్ గురించి తెలుసుకోవాలన్నా, అవి నేర్చుకోవాలన్నా డాన్స్ టూ దిస్ డాట్ కామ్ క్లిక్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ దొరుకుతాయి. హిప్ హాప్, పాప్, స్ట్రీట్, బ్రేక్, బాల్ రూమ్ లాంటి చాలా డ్యాన్సింగ్ ఫార్మాట్స్ కి సంబంధించిన ట్యుటోరియల్స్ ఉన్నాయి.
బ్లూప్
ట్విస్టర్ అనే బోర్డ్ గేమ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదే గేమ్ ని ట్యాబ్లెట్ మీద ఆడితే ఎలా ఉంటుంది? లింబ్స్ కి బదులు.. డిజిట్స్ వాడుతూ ఆడే గేమ్ బ్లూప్ వచ్చేసింది. ఇదొక మల్లీ ప్లేయర్ టచ్ గేమ్. ఒక ట్యాబ్ పై నలుగురు ఒకే సారి ఆడొచ్చు. ఫోర్ కలర్స్ లో నలుగురు నలుగురు నాలుగు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాలుగా కలర్స్ మారుతుంటే ఎవరి కలర్ ని వారు టచ్ చేయాల్సి ఉంటుంది. ఒకరి కలర్ ఇంకొకరు టచ్ చేసినా.. ఆ కలర్ ఎవరిదో వారికే పాయింట్ వస్తుంది. టైల్స్, వేవింగ్, డాడ్జింగ్, బ్లాకింగ్, పుషింగ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. చాలా సరదాగా కూడా ఉండే ఈ గేమ్ ఇప్పటి వరకు ఉన్న మల్టీ ప్లేయర్ గేమ్స్ కి డిఫరెంట్ గా ఉండడమే దీని స్టయిల్. ఇద్దరు.. ముగ్గురు కూడా ఆడొచ్చు. గేమ్ స్టాటింగ్ లో బానే ఉంటుంది కానీ.. కాస్తయ్యాక.. టైల్స్ కుచించుకుపోతే.. వేళ్లు కదపడం.. కష్టంగా ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లలో ఈ గేమ్ ఫ్రీ గా లభిస్తోంది.
నోకియా లుమియా 925 అండ్ 625
నోకియా లుమియా సిరీస్ కి రెండు కొత్త మొబైల్స్ యాడ్ అయ్యాయి. 925 మోడల్ నేమ్ తో మార్కెట్ లోకి వచ్చిన ఫోన్ 1280 బై 768 పిక్సెల్స్ రెజల్యూషన్ తో 4.5 ఇంచ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1.5 గిగా హెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉంటాయి. 8 ఎంపీ రియర్, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరాలుంటాయి. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీని ధర33,499 రూపాయలు.
లూమియా 625
నోకియా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఇదే బెస్ట్ ఫోన్. 4.7 ఇంచ్ డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ 800 X 480 పిక్సెల్స్ రెజల్యూషన్ ను కలిగి ఉంది. 1.2 గిగా హెడ్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, 512 MB ర్యామ్, ఆడ్రెనో 305 Gpu, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ ఫీచర్లు. VGA ఫ్రంట్ కెమెరా, 5 MP రియర్ కెమెరాలతో 1080 పిక్సెల్స్ వీడియోలు తీయొచ్చు. దీనిలో ఉన్న 2,000 MAh బ్యాటరీతో కంటిన్యూయస్ గా 24 గంటలు నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. సూపర్ సెన్సిటివ్ టెక్నాలజీతో తయారుచేసిన టచ్ స్క్రీన్ తో డైరెక్ట్ సన్ లైట్ పడుతున్న టైంలో కూడా మొబైల్ ను ఆపరేట్ చేసుకోగలగడం ఈ ఫోన్ స్పెషాలిటీ. దీని ధర 19,999 రూపాయలు.
వాకమ్ సిన్టిక్ కంపానియన్ ట్యాబ్స్
గ్రాఫిక్ ప్రొఫెషనల్స్ కోసం వాకమ్ ఎక్స్ క్లూజివ్ గా 2 పెన్ టాబ్లెట్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. అవే సింటిక్ కంపానియన్ అండ్ సింటిక్ కంపానియన్ హైబ్రిడ్. ఇంతకుముందు వచ్చిన పెన్ టాబ్లెట్స్ పనిచేయడానికి కంప్యూటర్ హెల్ప్ అవసరమయ్యేది. కానీ ఈ పెన్ ట్యాబ్లెట్లను పర్సనల్ డివైస్ లా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ట్యాబ్లెట్స్ 13.3 ఇంచ్ ఫుల్ హెచ్ డీ టచ్ స్ర్ర్కీన్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. విండోస్ 8 లేదా ఆండ్రాయిడ్ తో పనిచేస్తాయి. విండోస్ 8 పనిచేసే వాటిలో ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీలు ఉంటాయి. ఆండ్రాయిడ్ వెర్షన్ తో పనిచేసేవి ఎన్వీడియా టెగ్రా 4 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ రెండు ట్యాబ్లెట్లు అక్టోబర్ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.

No comments:

Post a Comment