
- డిఫెండింగ్ ఛాంపి యన్స్‌గా బరిలోకి దిగిన టాప్ సీడ్ ఆటగాళ్లు జకోవిచ్, సెరీనాలు యుఎస్ ఓపెన్ లీగ్ మ్యాచ్‌ల్లో ఎదురులేని విజయాలను సొంతం చేసుకుంటున్నారు. వీళ్ల విజృంభన ముందు ప్రత్యర్థి ఆటగాళ్లు తొలినుంచే నిలువలేకపోతున్నారు.అమెరికా: ప్రతిమ్యాచ్‌లోనూ ఆట ఆరంభం నుంచి తిరుగులేని పోటీనిస్తున్న సెరీనా క్వార్టర్స్‌లోనూ కర్లా స్క్వాజ్ నవారోతో 6-0, 6-0తో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి ఆటగాడికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా గెలుపును సొంతం చేసుకోవడమంటే సత్తా ఏంటో అర్థమవుతోంది. అనంతరం మాట్లాడుతూ నవారో కూడా అద్భుతమైన క్రీడాకారిణిగా సెరీనా కొనియాడింది.
అయితే ఆమె అద్భుతమైన క్రీడాకారిణి, ఈ మ్యాచ్‌లో కొంత ప్రదర్శన వెనుకబడిందని ఆమె తెలిపింది. కెరీర్‌లో ఐదో యుఎస్ టైటిల్ కోసం ఆరాటపడుతున్న సెరీనా గత 15 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌లో ఇలాంటి విజయం సాధించడం విశేషం. 18 గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌లను సొంతం చేసుకున్న మార్టినా నవ్రతిలోవా కూడా ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఒక్కసారి మాత్రమే . స్క్వాజ్ నవారో ముందుగానే ఇలాంటి ఫలితాన్ని ఊహించానని మ్యాచ్ అనంతరం తెలిపింది. అయితే 71 బ్రేక్ పాయింట్లలో 53 పాయింట్లను సద్వినియోగం చేసుకన్న సెరీనా ప్రత్యర్థిని తొలినుంచే కంగుతినిపించింది. తొలిసెట్‌ను కేవలం 18 నిమిషాల్లోనూ పూర్తి చేసిన సెరీనా, రెండో సెట్‌లో కాస్త నెమ్మదించింది. మూడో సెట్‌ను కూడా అలవోకగా కైవసం చేసుకుంది. అనంతరం మాట్లాడుతూ తన ఆటతీరును మెరుగుపరుచుకున్నట్లు విలియమ్స్ తెలిపింది. సెరీనా విజయంపై నవ్వుతూ మాట్లాడింది. 'నేను అద్భుతంగా ఆడాను. చాలా కష్టపడ్డాను. నేను దేనిపై ఇష్టంగా కేంద్రీకరించినా అందులో రాణిస్తాను, నాపై నాకు అత్యంత నమ్మకముంది, నా డ్రెస్సింగ్ రూమ్ నుంచి ప్రతి విషయంలోనూ మెరుపరుచుకున్నా' అని విశ్వాసాన్ని ప్రకటించింది. తన సెమీస్‌లో 2011 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన చైనా క్రీడాకారిణి లినాతో పోటీని ఎదుర్కోవాల్సి వుందని, అందులోనూ రాణించేందుకు కృషి చేస్తానని చెప్పింది. 'ప్రతి సంవత్సరం మరింతగా కష్టపడాల్సి వస్తోంది. రోజురోజుకూ మారుతున్న శారీరక చైతన్యం వల్ల ప్రతి మ్యాచ్‌లోనూ మరింత కష్టపడాల్సి వస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కి ఉత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి ప్రయత్నిస్తా' అని తెలిపింది.
ఎదురులేని జకోవిచ్
తిరుగులేని విజయాలతో జకోవిచ్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. లీగ్ మ్యాచ్‌ల్లో మార్సల్ గ్రనోలర్స్‌పై 6-3, 6-0, 6-0 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశిం చాడు. 70 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ ఆరంభం నుంచి పోరాటపటిమతో రాణించాడు. ఆకట్టుకున్నాడు. 2007లో గ్రాండ్‌శ్లామ్‌లో నాల్గో రౌండ్‌లో వెనుదిరిగిన అనంతరం జకోవిచ్ మళ్లీ పునరావృతం కాకుండా ఆడుతున్నాడు.
మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడుతూ 'నా కెరీర్‌లో అత్యద్భుతమైన మ్యాచ్. నా ఆటలో ఎలాంటి దోషాలు లేకుండా కొనసాగించాను' అని చెప్పాడు.
'నా కెరీర్‌లో మంచి రోజులు వచ్చాయి. ఈ టోర్నీ ద్వారా ఆటను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు పట్టుదలతో వున్నాను. విజయానికి అవసరమైన ప్రతీ పాయింట్‌ను పట్టుకుంటాను. టాప్‌లో నిలిచేందుకు నిత్యం పట్టుదలతో కృషిచేస్తానును' అని జకోవిచ్ తెలిపాడు. తన మానసిక, శారీరక సామర్థ్యంపై ఆనందాన్ని వ్యక్తంచేశాడు. హెవిట్‌తో జరిగిన మ్యాచ్‌లో నాల్గో సెట్ ఆధిక్యంతో కొద్దిగా ఇబ్బందికి గురయ్యాను. మళ్లీ నా సామర్థ్యాన్ని పెంచుకుని ప్రత్యర్థిని ఓడించానని జకోవిచ్ తెలిపాడు.
No comments:
Post a Comment