'సినీ రంగం'.. ఎప్పుడూ మార్పులకు గురవతున్న ఇండస్ట్రీ. దీనిలో హీరోలే ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. వారు ఏం చేసినా.. సంచలనమే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కథ నచ్చి చేస్తున్నారో..
లేక ఇతర నిర్మాతలు ఆ సినిమాలు నిర్మించడానికి సాహసం చేయలేరనో.. లేక బిజినెస్ మీద మోజు పడో తెలియదు గాని ఎక్కువగా హీరోలు ఈ మధ్య నిర్మాతలుగా మారిపోతున్నారు. కొత్తగా నిర్మించినా.. మొదటి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీనీ ఏలుతున్నారు. వీరు మిగతా నిర్మాతలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ లో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడ దర్శకులే నిర్మాతలుగా మారుతున్నారు. ఇలా వచ్చి సక్సెస్ లు సాధించి తమ వ్యాపారం పెంచుకున్న వారు కొందరైతే.. మొదట్లోనే డీలా పడిన వారు కొందరున్నారు. ఇలా బాలీవుడ్. టాలీవుడ్ ఏదేమైనా.. సాధారణంగా హీరోలు నిర్మాతలుగా మారడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా వచ్చిన స్టార్ నిర్మాతల గురించి తెలుసుకుందాం..
బాలీవుడ్ హీరో నిర్మాతలు..
బాలీవుడ్ లో తొలి తరం హీరోలు రాజ్ కపూర్, నిన్నటి తరం స్టార్ అమితాబ్ తమ నిర్మాతల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం... ఇలా బాలీవుడ్ ను ఏలుతున్న హీరోలు కూడా ఇప్పుడు ప్రొడక్షన్ కంపెనీలు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. అలా వీరి సినిమాలు సూపర్ హిట్ సాధించి కలెక్షన్ల వేటలో పరిగెడుతున్నాయి. అయితే ఈ హీరోలు నిర్మిస్తున్న చిత్రాల్లో చాలా రిస్కీ ప్రాజెక్ట్స్, భారీ బడ్జెట్ చిత్రాలు ఉండటం విశేషం.
అమీర్.. : బాలీవుడ్ లో నిర్మాతగా మారి మొదటి స్థానంలో ఉన్న స్టార్ హీరో 'అమీర్ ఖాన్'. 'మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ లగాన్'తో ప్రొడ్యూసింగ్ మొదలుపెట్టారు అమీర్. 2001లో లగాన్ సినిమాను సొంత బ్యానర్ పై నిర్మించి అదరగొట్టాడు. అటు విదేశీ విభాగంలో మన దేశం నుంచి ఆస్కార్ కు నామినేట్ అయ్యింది ఈసినిమా. నటుడిగా ప్రేక్షకుల్లో మంచి ఈమేజ్ ఉన్న అమీర్....నిర్మాతగా గ్రాండ్ లాంఛ్ ఇచ్చి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత 'తారే జమీన్ ఫర్', 'దోబీ ఘాట్', 'తలాష్'.. ఇలా వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ....ఫిల్మ్ మేకింగ్ లో తన ప్రత్యేకత చాటుతున్నారు అమీర్.
సల్మాన్ ఖాన్.. : బాలీవుడ్ స్టార్ హీరో 'సల్మాన్ ఖాన్' ది నిర్మాతగా సక్సెస్ ఫుల్ హిస్టరీ. అయితే మిగతా హీరోల్లా డైరక్ట్ గా కాకుండా తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో సినిమా నిర్మాణం చేయిస్తున్నాడు సల్లూ భాయ్. ఈ స్టార్ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'దబాంగ్' సిరీస్ సినిమాలను సొంత బ్యానర్ లోనే చేశాడు. పిల్లలపై తనకున్న ప్రేమను చూపిస్తూ... 'చిల్లర్ పార్టీ' అనే చిల్డ్రన్ ఫిల్మ్ సల్మాన్ నిర్మించాడు. చిల్లర్ పార్టీ జాతీయ ఉత్తమ బాలల సినిమాగా అవార్డును అందుకోవడం నిర్మాతగా ఈ స్టార్ హీరోకు ఓ స్వీట్ మెమొరీ.
షారూఖ్..: రికార్డ్ హిట్ లతో బాలీవుడ్ బాద్షా కిరీటాన్ని నిలబెట్టుకుంటున్న 'షారూఖ్' … ఫిల్మ్ ప్రొడక్షన్ లో కూడా కింగ్ నే అనిపించుకుంటున్నాడు. 'రెడ్ చిల్లీస్' బ్యానర్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మిస్తున్నాడు. 'మై హూన్ నా', 'ఓం శాంతి ఓం', 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'రావన్', 'డాన్' వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా బ్యానర్ రన్ చేస్తున్నాడు షారూఖ్. రీసెంట్ గా ఈ బాద్షా ప్రొడక్షన్ లో వచ్చిన 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' రికార్డ్ కలెక్షన్లతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
అజయ్ దేవగణ్: మరో బాలీవుడ్ హీరో 'అజయ్ దేవగణ్' 'న్యూ మిలీనియమ్' లో ప్రొడ్యూసర్ గా మారారు. అజయ్ దేవగణ్ ఫిల్మ్స్ బ్యానర్ పై 'రాజూ చాచా' పేరుతో ఫస్ట్ ఫిల్మ్ నిర్మించాడు. 'ఆల్ ద బెస్ట్ ఫన్ బిగిన్స్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ కథానాయకుడు నిర్మించిన 'బోల్ బచ్చన్', 'సన్ ఆఫ్ సర్దార్' బాక్సాఫీస్ హిట్లను అందుకున్నాయి. త్వరలో 'సింగం-2' సినిమాను అజయ్ నిర్మించనున్నాడు.
అక్షయ్ కుమార్: యాక్షన్ కామెడీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టే ఖిలాడీ 'అక్షయ్ కుమార్' సొంత బ్యానర్ 'హరి ఓం ప్రొడక్షన్స్'లో అత్యధిక సినిమాలు చేస్తున్నారు. 'కట్టా మీటా', 'పాటియాలా హౌస్', 'ఓ మై గాడ్', 'ఖిలాడీ 786' వంటి హిట్ సినిమాలు నిర్మించి బాలీవుడ్ బడా నిర్మాతలకే ఝలక్ ఇచ్చాడు అక్షయ్. ఇప్పటిదాకా 12 సినిమాలు నిర్మించిన అక్కీ... త్వరలో 'గుట్కా' అనే సినిమా నిర్మిస్తున్నాడు.
ఇక ఇదే బాటలో మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ప్రొడక్షన్ లో హల్ చల్ చేస్తున్నాడు. జాన్ నిర్మించిన ఫస్ట్ ఫిల్మ్ విక్కీ డోనర్ కమర్షియల్ క్రిటికల్ సక్సెస్ అందుకుంది. 'హోల్ సమ్ ఎంటర్ టైన్' గా బెస్ట్ నేషనల్ అవార్డును అందుకుంది. రీసెంట్ గా ఈ హీరో నిర్మించిన 'మద్రాస్ కేఫ్' సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
నిర్మాతలుగా టాలీవుడ్ దర్శకులు...
టాలీవుడ్ లో మొదట మన దర్శకులకు నిర్మాణ బాటను చూపింది 'రామ్ గోపాల్ వర్మ'. 'అనగనగా ఓ రోజు' సినిమాతో నిర్మాతగా మారిన వర్మ... ఆ తర్వాత తన కంపెనీ నుంచి చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను బాక్సాఫీస్ పైకి వదిలాడు. వర్మ శిష్యుల్లో చాలా మంది వర్మ బ్యానర్ నుంచే దర్శకులుగా మారారు. 'సత్య', 'సర్కార్', 'సర్కార్ రాజ్ ', 'కంపెనీ' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆర్ జీవీ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ ద్వారా నిర్మించాడు రామ్ గోపాల్ వర్మ.
ఇక నిర్మాతగా మారిన దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. ఆయన రెగ్యులర్ గా తన బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడిగా సినిమాలు లేకపోవడంతో 'లాహరి లాహరి లాహిరిలో' సినిమా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ తో 'దేవదాసు', 'సీతయ్య' వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు. ప్రస్తుతం 'రేయ్' సినిమాతో మరో ఓన్ ప్రొడక్షన్ ఫిల్మ్ తో వస్తున్నాడు చౌదరి. 'వైష్ణో అకాడెమీ' బ్యానర్ పై 'ఇడియట్', 'పోకిరీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న దర్శకుడు 'పూరీ జగన్నాథ్'. పోకిరీ తర్వాత నిర్మాతగా సినిమాలు తగ్గించాడు పూరీ. బాలీవుడ్ లో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ పూరీ నిర్మించిన లాస్ట్ ఫిల్మ్. త్వరలో తమ్ముడు సాయిరాం శంకర్ తో 'రోమియో' సినిమాను నిర్మిస్తున్నాడు పూరీ.
విప్లవ చిత్రాల వెన్నెముక ఆర్ నారాయణ మూర్తి దర్శకుడిగా నిర్మాతగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల తన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నా....రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'నిర్భయ భారతం' పేరుతో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు తెరరూపమిచ్చారు. వీరే కాక.. దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, భీమినేని శ్రీనివాసరావు, గుణశేఖర్ సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నయనతారతో 'అనామిక' చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తుండగా...గుణశేఖర్ చారిత్రక సినిమా 'రుద్రమదేవి'ని నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా త్వరలో ఓ బ్యానర్ పెట్టబోతున్నాడని సమాచారం.
మంచి దర్శకులు ప్రొడక్షన్ పెడితే ఫర్వాలేదు గానీ... కొందరు బూతు చిత్రాల దర్శకులు.. నిర్మాతలుగా రావడమే దురదృష్టకరమని అంటున్నారు సినీ విమర్శకులు. ఇలాంటి వారి నిర్మాణంలో యూత్ అనే సాకుతో బూతు సినిమాలు చేసే ప్రమాదం ఉందని సినీ విమర్శకులు ఆవేదన చెందుతున్నారు. సో ఈ ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో చూడాలి.

No comments:
Post a Comment