Friday, September 6, 2013

'కృష్ణం రాజు', 'ప్రియమణి', చండి’.

'కృష్ణం రాజు', 'ప్రియమణి', 'శరత్ కుమార్' ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘చండి’. వి. సముద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీకి శ్రీనుబాబు.జి నిర్మాత. లేటెస్ట్ గా ఎన్.ఆర్.శంకర్,
చిన్నా మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియో ప్లాటినమ్ ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..'' ఈ చిత్రం టీజర్ కు చాలా మంచి స్పందన వస్తుంది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది''. అని అన్నారు. నటీ ప్రియమణి మాట్లాడుతూ.. 'మొదట ఈ సినిమాను చూసిన వారు హర్రర్ మూవీ అనుకుంటారు. కానీ ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ ఎంటర్ టైన్ గా ఉంటుంది. దీనిలో చండి తన కుటుంబం కోసం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎందుకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోవాలంటే తప్పకుండా సినిమా చూడాలి. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం రావడం నా అదృష్టం. దీనికి గాను దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు.'' అన్నారు.

No comments:

Post a Comment