Thursday, September 5, 2013

''రుద్రమదేవి'' త్రీడి

గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ''రుద్రమదేవి''. గుణా టీమ్ వర్క్స్ పతాకంపై
భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడి మూవీగా గుణశేఖర్ దీనిని తెరకెక్కిస్తున్నాడు.అనుష్క కీలక పాత్ర లో తెరకెక్కుతున్న 'రుద్రమదేవి' మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతోంది. అప్పట్లో ఓరుగల్లు కోట నుంచి వేయి స్తంభాల గుడి వరకూ ఓ సొరంగం ఉండేది. అలనాటి కాకతీయుల వైభవం, వాస్తవికత ఉట్టిపడేలా  కళ్లకు కట్టినట్లు హైదరాబాద్ లోనే తోటతరణి ఆధ్వర్యంలో సెట్ వేయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సొరంగంలోనే అనుష్క, బాబా సెహగల్ ల పై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సొరంగంలో సీన్స్ కొత్త ఎక్స్ పీరియన్స్ గా ఉన్నా అదేపనిగా సొరంగంలో ఉండాల్సి రావడం చాలా ఇబ్బందిగా మారిందట అరుంధతికి. రుద్రమదేవి కోసం ఓ ఐల్యాండ్, దివిసీమ ఉప్పెనను కూడా సెట్స్ రూపంలోనే చూపించబోతున్నారట దర్శకుడు గుణశేఖర్. ఓ వైపు సెట్స్ నిర్మాణం జరుగుతుంటే, మరోవైపు ఈ నెల 2 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం.

No comments:

Post a Comment