పేదవాడి ఆపిల్... అరటి పండు గురించి తెలుసుకుందాం... ఈ పండులో తక్షణం
శక్తినిచ్చే గుణం ఉంది. ఇది సంవత్సరం పొడవునా దొరుకుతుంది. దీనిని మన జీవన
విధానంలో
చేర్చడం ద్వారా జీవక్రియలకు కావాల్సిన ఆంటి యాక్సిడెంట్స్,
విటమిన్స్, మినరల్స్ పొందవచ్చు.100 గ్రాముల అరటి పండులో... 90కాలరీల శక్తి, 10 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల షుగర్ ఉంటాయి. జీవక్రియలకు ఉపయోగపడే పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి. అరటి పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఎ,బి, సి లు అత్యధికంగా ఉంటాయి. ఇందులో శరీరానికి హాని చేసే కొవ్వు ఉండదు.. పైగా అరటి నుంచి కావాల్సినంత కాల్షియం, ఐరన్ లభిస్తుంది. రక్త పోటును తగ్గించడంలో, గుండె పనితీరును మెరుగు చేయడంలో ఉపయోగపడే మూలకాలలో ఒకటైన పొటాషియం ఈ అరటి పండులో అత్యధికంగా ఉంటుంది.
ఆయుర్వేద ఔషదం.. కలబంద
నివారణం సాధ్యం కాని సమస్యలను చిన్నపాటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఏ కాలంలో నైనా అందుబాటులో ఉండి ఔషద గుణాలు కలిగిన కలబందలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అది అందించే పోషకాలు, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం... కలబందలో ఆయుర్వేద ఔషద గుణాలున్నాయి. వ్యాధి రోధకతను పెంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇవే కాక కలబందలో విటమిన్లు ఎ,సి, ఇ విటమిన్ 'బి' లు ఉంటాయి. ఇంకా దీనిలో అమైనో, ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. దీని వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేసుకోవచ్చు.

No comments:
Post a Comment