Wednesday, September 4, 2013

కరివేపాకుతో కేశ సౌందర్యం

కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారంలో కరివేపాకుకు మీరు ప్రాధాన్యం ఇస్తే మీ కురులు తెల్లబడవు. చిన్న వయస్సులోనే జుట్టు నెరవడం
లాంటి సమస్యలకు కరివేపాకుతో చేసిన హెయిర్‌ప్యాక్స్‌తో అడ్డుకట్ట వేయవచ్చు.

యఅరకేజీ నువ్వుల నూనె కాచి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చ చేసి, తలకు పట్టించాలి. ఇలా గంటసేపు ఉంచి కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు క్రమేణా నల్లగా మారుతుంది.
యకప్పు కరివేపాకును మెత్తగా రుబ్బి, అందులో మూడు స్పూన్ల మెంతిపొడిని కలిపి ఆ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. తడంతా ఆరిపోయాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది.
యకరివేపాకునూ, మందారపువ్వులనూ సమపాళ్లల్లో తీసుకొని కాసింత నీరు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో అంతే పరిమాణంలో ఉసిరికాయ పొడి కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి, 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మీ జుట్టు మృదువుగా అవడమే కాదు, నిగారింపు కూడా వస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేయాలి. అలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
యగోరింటాకు, కరివేపాకు, మందార ఆకు, కుంకుడు కాయలు అరకప్పు చొప్పున తీసుకుని పేస్టులు తయారుచేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి, ముందు రోజే నానబెట్టుకోవాలి. మరుసటి రోజు తలకు బాగా పట్టించి, పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ జుట్టు మెరిసి పోతుంది. తెల్లజుట్టు క్రమేణా నల్లగా మారుతుంది.

No comments:

Post a Comment