'అలీ' హీరోగా 'కమల్ సినీ క్రియేషన్స్' పతాకం పై తెరకెక్కుతున్న చిత్రం '' అలీ బాబా ఒక్కడే దొంగ''. 'సూజవారుని' హీరోయిన్. బొడ్డేడ శివాజి నిర్మిస్తోన్న
ఈ మూవీకి ఫణి ప్రకాష్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఆన్ లొకేషన్ లో హీరో ఆలీ మాట్లాడుతూ.. '' సినిమా నిర్మాణం దాదాపు చివరి స్టేజీకి వచ్చింది. దీనిలో మొత్తం నాలుగు పాటలున్నాయి. వాటిలో మొదటిది వినాయకునిపై తయారుచేశాం. ఇప్పుడు అది నడుస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ సంగీతం అందిస్తున్నాడు. మరో పాట బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ అయితే సినిమా నిర్మాణం పూర్తయినట్లే.'' అని అన్నారు. మంగళవారం జరిగిన ఆన్ లొకేషన్ లో భాగంగా వినాయకుని విగ్రహం వద్ద పాట చిత్రీకరిస్తున్నారు.
No comments:
Post a Comment