గర్భంతో ఉన్నప్పుడు తల్లి మరియు ఇంకా పుట్టని శిశువుయొక్క ఆరోగ్యానికి శ్రద్ధ చూపించటం చాలా అవసరం. అనేక గర్భాలు క్లిష్టతరం కాకుండానే ఉంటాయి
ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మరియు మన జీవనశైలి సాధారణంగ ఉంటాయి. ఇక్కడ మేము ఈరోజుల్లో స్త్రీల్లు గర్భధారణ సమయంలో ఎదుర్కునే సమస్యలు కొన్నింటిని పొందుపరుస్తున్నాము. ఒకవేళ, మీరు గర్భధారణ సమయంలో వీటిలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ గైనకాలజిస్ట్ సంప్రదించినట్లయితే, మీకు సరిఅయిన సలహా సూచిస్తారు. గర్భధారణ స్త్రీలకు సమస్యలు ఉన్నట్లయితే మానసికంగా వాటిని అధిగమించటానికి ధైర్యంగా ఉండాలి. మీ వెనకాల మీ కుటుంబం మానసికంగా, వ్యక్తిగతంగా మీకు తోడుగా ఉన్నదని మర్చిపోవోద్దు. గర్భధారణ సమయంలో సమస్యలు ఎదుర్కోవటం అన్నది తల్లికి మరియు శిశువుకు కూడా ప్రమాదకరం. అందువలన ఈ సమయంలో సరైన జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండ డాక్టర్ చేత పరీక్షలు చేయించుకోవటం అనేది మీ మరియు ఇంకా పుట్టని శిశువు ఆరోగ్యానికి తప్పనిసరి. గర్భధారణ సమయంలో సమస్యలను ఒకసారి చూడండి. మీరు వీటిలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి.
No comments:
Post a Comment