గణేషుడి నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం వినాయక విగ్రహాలు బారులు తీరాయి. బుధవారం ఉదయం నుండి కొనసాగుతున్న నిమజ్జనం కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. సికందరాబాద్, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్గంలో వినాయక విగ్రహాలు ఇంకా బారులు తీరాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి - సీపీ
హైదరాబాద్ : నిమజ్జనం పూర్తయ్యే వరకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. నగరంలోని ఏంజే మార్కెట్ వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు 15వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, ఏంజీ రోడ్డు నుండి వచ్చే వాహానాలను రాణిగంజ్ వద్ద దారి మళ్లిస్తామని సీపీ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ రోటరీ వైపు నుండది ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకపోకలను నిషేధించినట్లు సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.

No comments:
Post a Comment