Monday, September 30, 2013

చిలగడ దుంప ఎంతో ఆరోగ్యం

చిలగడ దుంపలు, గెన్సు గడ్డలు,మోరం గడ్డలు, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవబడే స్వీట్‌ పొటాటోలు తింటే నాలుకకు రుచే కాదు, ఒంటికి ఆరోగ్యాన్నీ అందిస్తాయి.మనలో చాలా మంది చిలగదుంపలు అంటే ఏదో కాస్త తీయగా
ఉండే మామూలు దుంపలు అనుకుంటారు. కాని అది పోషకాల గని. రోజుకు ఒక కప్‌ అంటే 7 ఔన్స్‌లు తింటే 65 శాతం విటమిన్‌ సి శరీరానికి అందుతుంది. నిజానికి ఆ మాత్రం విటమిన్‌ సి మనకు రోజూ అవసరం.ఈ దుంపలు కాల్షియం,ఫోలేట్‌,పొటాషియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో విటమిన్‌ ఎ గా పరివర్తనం చెంది రేచీకటి సంభవించే అవకాశాలను తగ్గిస్తుంది.వీటిలో సాధారణంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. అంటే ఆస్తమా, అలర్జీలు ఉన్న వారికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు తినగలిగిన ఆహారపు జాబితాలో ఇది కూడా ఉంది. ఈ దుంపలు తిన్న తర్వాత వాటిలో స్వతహాగా ఉన్న తీపిని గ్లూకోజ్‌ రూపంలోకి మార్చి శరీరంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇటువంటి ఆహారాలు డయాబెటిక్‌ పేషంట్‌కు చాలా ఉపయోగం కలిగిస్తాయి. రక్తంలో త్వరగా విడుదల అయిపోయి, మళ్ళీ త్వరగా ఎక్కువైపోయే బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. స్వీట్‌ పొటాటోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం లోపం వలన వచ్చే కండరాలు తిమ్మిరి పట్టడం లాటి సమస్యలను దరిచేరనివ్వదు. మనం ఎక్కువగా ఒత్తిడికి లోనైనపుడు శరీరం మరింతగా పొటాషియంను ఖర్చు పెట్టడం మొదలు పెడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో వీటిని తీసుకోవడం వలన పొటాషియం లోపం సరి అవడమే కాక ఒత్తిడి వలన కలిగే చెడు ప్రభావాలను తగ్గిపోతాయి. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌ లను కలిగి ఉండటం అంటే ఇక చర్మానికి సూపర్‌ ఫుడ్‌ అన్నమాటే. వయస్సు ప్రభావాన్ని తగ్గించి చర్మాన్ని అందంగా ఉంచుతుంది.మామూలుగా ఉడికించి, వేయించి తినేకంటే ఆవిరిలో ఉడికించి తినడం వలన అందులోని పోషకాలు,రుచి ఏమాత్రం తగ్గవు. స్నాక్స్‌ తినాలనిపిస్తే పటేటో చిప్స్‌ కాకుండాఈ మోరంగడ్డలు తినండి. పుష్కలంగా పోషకాలు అందడంతో పాటు, తగినంత పీచు పదార్ధం అంది జీర్ణక్రియ బావుంటుంది.

No comments:

Post a Comment