ఆస్ట్రేలియాతో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నిరీక్షణ ఫలించింది. వచ్చే నెల 10వ తేదీన స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కు యువరాజ్ కు బెర్తు దొరికింది. పరిమిత
ఓవర్ల క్రికెట్ సిరీస్ కు యువరాజ్ ను ఎంపిక చేశారు. అంతేగాకుండా అంబటి రాయుడికి కూడా స్థానం దక్కింది. ఒక టి-20, మూడు వన్డేలకు భారత జట్టు ను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సోమవారం సమావేశమైన భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఇరు జట్లు మొత్తం ఏడు వన్డేలు ఆడనున్నాయి. భారత్ తరపున చివరి సారిగా జనవరి 27వ తేదీన యువీ మ్యాచ్ ఆడాడు. ఇటీవల వెస్టిండీస్ 'ఎ' జట్టుపై యువరాజ్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కీలక ఇన్నింగ్స్ లు ఆడి సూపర్ ఫాం అందుకున్న యువీ జాతీయ సెలక్టర్లను ఆకర్షించాడు. భారత టీం : మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, రవీచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, ఉనాద్కట్

No comments:
Post a Comment