ముంబైలో బ్యాడ్మింటన్ లీగ్ ఐబిఎల్ ముగిసి వారాలు గడుస్తున్నా విజేత జట్టు హైదరాబాద్ హాట్‌షాట్స్ సభ్యులు ఇంకా ఆ విజయ శిఖరమే విడిదిగా వాడుకొంటున్నారు. ఈ పోటీల్లో అందరి
అభిమాన క్రీడాకారిణి నైనా నెహ్వాల్ ఓ మెరుపు మెరిసింది. ఐబిఎల్ పోటీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా తమిళనాడు నుంచి హైదరాబాద్ జట్టులోకి వచ్చి, మహిళల సింగిల్స్‌లో నెహ్వాల్ తర్వాతి స్థానంలో ఉన్న వి.కాంతి ఐబిఎల్ పోటీల వాతావరణాన్ని సంపూర్తిగా ఆనందించింది. ఐబిఎల్ అంటే ముందు చెప్పుకోవలసింది సరదాయే అంటోంది కాంతి. ఈ సందర్భంగా తనకు కొన్ని కొత్తస్నేహాలు కలిసాయని, అపర్ణా బాలన్, అశ్వినీపొన్నప్పన్ వంటి వారితో మాట్లాడే అవకాశం కలిగిందని తెలిపింది. ప్రత్యక్షంగా ఆడకుండా పక్కన ఉండి పోటీలు గమనించడం కూడా నేర్చుకొనే అవకాశం ఇచ్చిందని తెలిపింది. ముఖ్యంగా నెహ్వాల్, తారిక్ హిదాయత్ వంటి సీనియర్ల నుంచి చాలా నేర్చుకొన్నానని ఆనందిస్తోంది. ఆమె చెన్నైలో ఇంకా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతోంది. 
No comments:
Post a Comment