అనంతపురం : నగర శివారులోని పెట్రోలు బంకు సమీపంలో ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి
విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ముదిగుబ్బ ప్రాంతానికి చెందిన విద్యార్థిని వాణి..నగరంలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. కాలేజీ నుండి సైకిల్ పై తిరిగి వెళుతున్న ఆమెను ఓ ఉన్మాది అటకాయించి యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, ఛాతీ భాగం పూర్తిగా కాలిపోయాయి. స్వగ్రామానికి చెందిన రాఘవ అనే వ్యక్తి తనను వేధింపులకు గురిచేస్తున్నాడని వాణి గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రస్తుతం ఇతనిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment