హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మహిళలపై వరకట్న వేధింపులు ప్రతి ఏడాదీ పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో స్పష్టం చేసింది. దేశంలో స్త్రీలకు రక్షణ కరువైంది. అడుగుకో
అత్యాచారం, నిమిషానికో దారుణం చోటుచేసుకుంటోంది. ఎన్ని చట్టాలొచ్చినా, ఎంత మంది అరిచి గీపెట్టినా జరగకూడని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అత్యాచారాలతో దేశంలో అరాచకాలు జరుగుతుంటే దానికి తోడు అత్తారింటి దాష్టికాలు పెరిగిపోయాయి. దేశంలో గంటకు ఓ మహిళ కట్న సంబంధ వేధింపులతో మృత్యు ఒడికి చేరుతోంది. ఈ ధనదాహ కేసులు 2007 నుంచి 2011 మధ్య మరీ ఎక్కువయ్యాయి. అధికారిక లెక్కలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. 2012 ఒక్క ఏడాదిలోనే వివిధ రాష్ట్రాల్లో అక్షరాలా 8,233 వరకట్న మరణాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని నేషనల్ క్ర్తైమ్ రికార్డ్ బ్యూరో స్పష్టం చేసింది.
గత ఏడాదిలో 32 శాతం
వరకట్న వేధింపుల వల్ల మరణించిన వారి కేసులు 2011లో కూడా భారీగా నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో దాదాపు 35 శాతం కేసులు కట్నసంబంధిత నేరాలే ఉండటం సమస్య తీవ్రతను తెలియచేస్తోంది. గత ఏడాదిలో ఈ కట్న సంబంధిత కేసుల సరాసరి 32 శాతంగా ఉంది. 2007లో 8,093 మరణాలు నమోదవ్వగా, 2008లో 8,172, 2009లో 8,383, 2010లో 8,391 మరణాలు సంభవించాయి. గణాంకాలు చూస్తుంటే మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది కాని తగ్గటం లేదు. మహిళలపై దాడులు, వరకట్న వేధింపులకు కారణాలను అన్వేషిస్తే... నేషనల్ క్ర్తైమ్ రికార్డ్ బ్యూరో వారు చెబుతున్న విషయాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. వరకట్న వేధింపులు కేవలం పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకే పరిమితం కాలేదు. ధనిక కుటుంబాలు, విద్యావంతులు ఉన్న కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న విద్యావంతులు కూడా ఈ సాంఘిక దురాచారాన్ని వ్యతిరేకించటం లేదు. కట్నం తీసుకోకుండా ఉండట్లేదు. అనాదిగా సమాజంలో విషవృక్షంగా ఇది పాతుకు పోయిందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.
వరకట్న నిషేధ చట్టం-1961
వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు ఉన్నా... ఆచరణలో మాత్రం వాటి ప్రభావం కనిపించటం లేదు. వరకట్న నిషేధ చట్టం-1961 ప్రకారం కట్నకానుకలు ఇవ్వటం, స్వీకరించటం కూడా నేరమే. వరకట్న వేధింపులు మొదలవ్వగానే మహిళలు సమస్యను చట్టం దృష్టికి తీసుకురాకపోవటం, పోలీసులు కూడా కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటంతో ఈ కేసులు నిలబడట్లేదని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ కామిని జైస్వాల్ అంటున్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు త్వరితగతిన విచారణ ప్రారంభించి మొదట్లోనే చర్యలకు దిగితే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మన న్యాయవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆమె విచారం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment