పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ దోషి అని సీబీఐ కోర్టు తీర్పుచెప్పింది. సుమారు 17 సంవత్సరాలు తరువాత తీర్పు వచ్చింది. 1996లో ఈ కుంభకోణం
బయటపడితే 1997లో సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. లాలూతో సమా 44 మందిని దోషిగా కోర్టు నిర్ధారించింది. రేపు శిక్షను ఖరారు చేయనున్నారు. సుమారు 38 కోట్ల దాణా కుంభకోణం జరిగింది. లాలూకు కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం లాలూపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని సమాచారం.

బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ పాలనలో దాణా కుంభకోణం వెలుగు చూసింది. దాదాపు రూ. 990 కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శలు వచ్చాయి. ఇందులో లాలూ, అప్పటి మంత్రి జగన్నాథ్ మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులతో సహా పలువురు వ్యక్తులు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మొత్తం 56 మందిని నిందితులుగా పేర్కొనగా విచారణ సమయంలోనే ఏడుగురు మృతి చెందారు. 1997 సంవత్సరంలో ముఖ్యమంత్రి పీఠం నుండి లాలూ తప్పుకున్నారు.

No comments:
Post a Comment