'ఎన్టీఆర్' కు క్లాస్ ఇమేజ్ ను ఇస్తూ.. వస్తున్న 'సినిమా రామయ్యా వస్తావయ్యా'. హరీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, సమంతా హీరోయిన్లు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల చేస్తామని గతంలోనే
చెప్పారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి ఒకరోజు ముందే వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. ఆడియో విడుదలయిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానుల్లో టాక్ వినిపిస్తుంది. దర్శకుడు హరీష్ కూడా అదే అంచనాలతో ధీమాగా ఉన్నాడు. ఎన్టీఆర్ తనకు మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫీలవుతున్నాడట.అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దీనిలో ఎన్టీఆర్ రెండు గెటప్ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఒక సారి స్టూడెంట్ గెటప్ లోకనిపిస్తే.. మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడట. అంతే కాకుండా శ్రుతి హాసన్ విలన్ గా యాక్ట్ చేస్తుందనే సమాచారం ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. దీనిలోనే కొని నిమిషాల పాటు ఎన్టీఆర్ దుర్యోధనుడిగా నటిస్తూ.. డైలాగులు చెబుతాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ఆసక్తికర అంచనాలను పెంచుతోంది. సో.. దసరా రేసులో రామయ్య దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు అభిమానులు. మరి సినిమా అంచనాలను రీచ్ అవుతుందో లేదో..తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

No comments:
Post a Comment