Wednesday, September 25, 2013

నేను సీమాంధ్ర :సిఎం

రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సిఎం కిరణ్ పేర్కొన్నారు. రాజ్యసభ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ అంశంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమాన్ని కేంద్రం
పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సీమాంధ్ర నేతలంతా రాష్ట్రాన్ని ఏవిధంగా సమైక్యంగా ఉంచాలనే విషయం గురించి ఆలోచిస్తున్నారని వివరించారు. నదీ జలాల అంశంపై ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉన్నట్లు తెలిపారు. విభజన జరిగితే నీటి సమస్య వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఒక ప్రాంతంగా ఉంటేనే కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవచ్చని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందని గుర్తుచేశారు. సాగునీటి సమస్యలపై రాష్ట్రాల మధ్య వేసిన అన్ని సంఘాలు దారుణంగా విఫలమయ్యాయన్నారు. విభజన జరిగితే లక్షలాది మంది స్థానచలనం చెందాల్సి ఉంటుందని తెలిపారు. ఆందోళన చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించకుండా ముందుకెళ్లడం చాలా కష్టమన్నారు. చివరి బంతి పడే వరకు మ్యాచ్ ముగియదని ఈ సందర్భంగా కిరణ్ వ్యాఖ్యానించారు.


No comments:

Post a Comment