Wednesday, September 25, 2013

ఈ పాపం ఎవరిది?

నవ మాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డకు, తల్లికి ఉన్న బంధం విడదీయలేనిది. బిడ్డ ఏడిస్తే గుండెలకు హత్తుకుని పరవశించిపోయే మాతృత్వ మమకారం వర్ణించలేనిది. మరి ఇలాంటి బంధాన్ని ఇపుడు కొందరు తల్లులు
తృణప్రాయంగా విస్మరిస్తున్నారు. ఓ పసిగుడ్డును రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో వదిలివెళ్లడంతో కుక్కలు పీక్కుతుంటున్న ఘటన హైదరాబాద్, వనస్థలీపురం, బీఎన్ రెడ్డి నగర్ సిరిపురం కాలనీలో చోటు చేసుకుంది. చెత్త కుప్పల్లో ఉన్న శిశువును వీధి కుక్కలు పీక్కు తింటుండగా గమనించిన పారిశుధ్య కార్మికులు విషయాన్ని  పోలీసులకు చేరవేశారు. ఈ శిశువు ఎక్కడ నుండి వచ్చిందో, ఎవరు తెచ్చి పడేశారో తెలియదని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కుక్కల బారిన పడ్డ శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు  పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment