వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ న్యాయస్థానం బెయిల్ మంజార్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్
రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమాస్తుల కేసులో 2012 మే 27న జగన్ ను సిబిఐ
అరెస్టు చేసింది. 484 రోజుల పాటు ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో
విచారణ జరిపిన సిబిఐ పది ఛార్జిషీట్లను దాఖలు చేసింది. విచారణ అనంతరం
క్రిడ్ ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని
సిబిఐ..కోర్టుకు తెలిపింది. దీంతో జగన్ కు ఈరోజు సిబిఐ కోర్టు షరతులతో
కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ.2 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని
న్యాయస్థానం షరతు విధించింది. కోర్టు అనుమతి లేనిదే హైదరాబాద్ విడిచి
వెళ్లకూడదని కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేసుతో సంబంధమున్న
ఎవరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేయకూడదని ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే
బెయిల్ రద్దు చేయమని కోరుతూ న్యాయస్థానాన్ని సిబిఐ ఆశ్రయించవచ్చని
పేర్కొంది. జగన్ కు బెయిల్ రావడంతో ఆయన అభిమానులు, వైకాపా నేతలు
ఆనందోత్సవాల్లో మునిగారు.
No comments:
Post a Comment