పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. అత్తారింటికి దారేది సినిమా విడుదల
సమయానికంటే రెండు వారాలు ముందుగా ఈనెల 27 విడుదల చేయాలని నిర్మాత
భావిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన అత్తారింటికి
దారేది సినిమా పలు కారణాలతో విడుదలకు ముందే యూట్యూబ్ లో దర్శనమిచ్చి, పైరసీ
సీడీలు రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు
పోలీసులు, యాంటీ పైరసీ విభాగం వెంటనే రంగంలోకి దిగింది. తాజాగా అందుతున్న
వివరాల ప్రకారం చెన్నై సినీ ల్యాబ్ లో ఎడిటింగ్ రూం నుంచి సినిమా బయటకు
లీకైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పాత పైరసీ
నేరస్తులైన వెంకటేశ్(నెల్లూరు), కుమార్(విజయవాడ) లపై అనుమానం వ్యక్తం
చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో
ఉన్నారని వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
.jpg)
No comments:
Post a Comment