Saturday, September 14, 2013

పర్వాలేదనిపించిన..'పోటు గాడు'..

నలుగురు అమ్మాయిలు వెంటపడ్డా...ఒక్కరినే ప్రేమించడం హీరోయిజం. కానీ నలుగురు అమ్మాయిల వెంట కథానాయకుడు పడితే హీరో ఔన్నత్యం దెబ్బతిని అది విలనిజం అవుతుంది. సినిమాకు ఇది కొంచెం నెగటివ్ ను
తెచ్చింది. 'పోటుగాడు' సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ పై పోటు వేద్దామనుకున్న 'మనోజ్'....యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ తో విడుదలైన 'పోటుగాడు'...ప్రేక్షకులల్లో మాత్రం పర్వాలేదనే ఫిలింగ్ తెచ్చుకున్నాడు. అనువాద సినిమాలు చేసేప్పుడు అవి మన నేటివిటీకి ఎంతవరకు నప్పుతాయనేది దర్శకుడు ముందుగా చూసుకోవాల్సిన అంశం. హీరో నలుగురు అమ్మాయిల వెంటపడే కథ కన్నడలో హిట్ అయ్యిందని మక్కీకి మక్కి దించడం ఈసినిమాలో జరిగిన మొదటి తప్పిదం అని చెప్పవచ్చు.
కథ విషయానికి వస్తే.. అమ్మాయిలతో రొమాన్సే జీవితంగా గడిపే ఓ కుర్రాడి కథ పోటుగాడు. సినిమా ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలని ఓ కొండపైకి వేర్వేరుగా వెళ్తారు మనోజ్, పోసాని కృష్ణ మురళి. ఎలాగూ చనిపోతున్నాం కదా అని ఇద్దరు తమ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు చెప్పుకుంటారు. తనను ప్రేమించిన ఓ అమ్మాయి డబ్బులేదనే కారణంగా వేరే వాడితో పెళ్లికి సిద్ధపడిందని ...అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పోసాని చెబుతాడు. తన ఫ్యాష్ బ్యాక్ లో నాలుగు లవ్ స్టోరీలు ఉన్నాయని మనోజ్ చెప్పడంతో పోసానికి మతి పోతుంది. మనోజ్ ప్రేమ ఎవరితో.. ఎలా అనేది సినిమా కథ.
రొమాన్సే ఆక్సిజన్ గా భావించే 'గోవిందు' అనే క్యారెక్టర్ లో మనోజ్ నటించాడు. అతను ప్రేమించిన.. వైదేహి(సిమ్రాన్ కౌర్), ముంతాజ్(సాక్షి చౌదరీ), స్టేసీ(రేచల్), మేరి(అనుప్రియ) అనే నలుగురు హీరోయిన్ లు నటించారు.
విశ్లేషణ: - గోవిందు పాత్రలో మనోజ్ బాగా నటించాడు. చాలా ఎనర్జీతో ఉంది అతడి నటన. అయితే డైలాగ్ లు చాలా ఫాస్ట్ గా చెప్పడం వల్ల కొన్ని చోట్ల ప్రేక్షకులకు అర్థం కాలేదు. తండ్రిని చాలా సన్నివేశాల్లో ఇమిటేట్ చేయాలనుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. తన ఎక్సెప్రెషన్స్ తో చాలా చోట్ల నవ్వించాడు. పోసాని తన స్టైల్ కు తగిన క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్ లో ముంతాజ్ క్యారెక్టర్ చేసిన సాక్షి చౌదరి ఆకట్టుకుంది. గ్లామర్, నటన రెండింటింలో మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ, అచ్చు సంగీతం పోటుగాడుకి ఫ్లస్ పాయింట్స్. 'ఫ్యార్ మే పడిపోయా హై' పాట థియేటర్ ను ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. కన్నడలో హిట్ అందుకున్న 'గోవింద న మహా సినిమా' దర్శకుడు పవన్ వడియార్...రీమేక్ చేసే సమయంలో తెలుగు కు తగినట్లుగా మార్పులు చేస్తే బాగుండేది. మొదటి అర్థభాగం కాస్త నవ్విస్తూ సాగినా...సెకండాఫ్ బోర్ కొట్టించింది. క్లైమాక్స్ బాగుంది.
ప్లస్, మైనస్ లు: మనోజ్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ ప్రేక్షకులను మది దోచుకుంది. ఇక మైనస్ లు చూస్తే.. కథ ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేస్తుంది. దర్శకత్వంలో పవన్ వడియార్ ఇంకా బెటర్ గా చేస్తే బాగుండేది.
పోటుగాడుపై విడుదలకు ముందు వచ్చిన ఎక్సెపెక్టేషన్ తో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఆశించిన వినోదం దక్కలేదు. విజయం కోసం విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్న మనోజ్ కు మరోసారి సక్సెస్ దగ్గరికి వచ్చి పోయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు '10 టివి' ఇచ్చే రేటింగ్ - 1.5

No comments:

Post a Comment