ఆరోగ్యసమస్యలకు అనేక కారణాలుంటాయి. అలాగే జుట్టు సమస్యలకు కూడా అనేక కారణాల్లో వయస్సు మరియు ఒత్తిడి కూడా కారణం అవుతాయి. ఒత్తిడి వల్ల అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం వివిధ మార్గాలను వెతుక్కోవడంలో మహిళలు ఎప్పుడూ క్రేజీగా ఉంటారు. సంవత్సరాలుగా, అనేక సాంకేతిక పరిజ్ఞానాలు మరియు పద్ధతులను జుట్టు నష్టం ఎదుర్కోవడానికి మరియు జుట్టు పెరుగుదల ప్రోత్సహించడానికి అభివృద్ధి చేయబడ్డాయి . కానీ, హెయిర్ క్వాలిటీ కోసం రసాయనిక పద్ధతులను ఎందుకు ఎంపికచేసుకోవాలి. హానికరమైన కెమికల్స్ తో తయారు చేసిన హెయిర్ ఉత్పత్తులను వాడటం వల్ల జుట్టు నిర్జీవంగా, చిక్కుబడినట్లు మార్చుతుంది. అందువల్ల, మీ జుట్టు సమస్యల నివారణకు మరియు జుట్టుపెరుగుదలను వేగవంతం చేయడానికి పదిహేను పవర్ ఫుల్ నేచురల్ హోం రెమడీస్ ను అందిస్తున్నాం. వీటిని కనుక అనుసరించినట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది.
ఎగ్ మాస్క్: గుడ్డులో ప్రోటీన్స్, సెలీనియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, సల్ఫర్ మరియు అయోడిన్, వంటి మూలకాలు పుష్కలంగా ఉండటం వల్లహెయిర్ కేర్ లో గుడ్డు ముఖ్యవస్తువుగా ప్రధాన పాత్రపోషిస్తుంది. అంతే కాదు జుట్టు నష్టాన్ని అరికడుతుంది. మరియు గుడ్డు కేశాలను మందగా పెరిగేలా చేస్తుంది. గుడ్డుకు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి హెయిర్ కు మాస్క్ లా వేయాలి. ఎలా అప్లై చేయాలి: గుడ్డులోని తెల్లని ద్రవాన్ని మాత్రం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు తేనె మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కేశాలకు పూర్తిగా అప్లై చేసి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో మరియు షాంపూతో తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ కేశాలకు పొడిబారిన జుట్టు మరియు పాడైపోయిన తంతువులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.


No comments:
Post a Comment