''నేను ఇప్పటికీ నిత్య విద్యార్థినే.. దర్శకుడిగా నేర్చుకోవాల్సిన విషయాలు
చాలా ఉన్నాయి'' అని అంటున్నారు ప్రముఖ దర్శకులు, గాయకుడు, సంగీత దర్శకుడు
'సింగీతం శ్రీనివాసరావు'. ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వెల్ కమ్
ఒబామ'. సంజీవ్, ఊర్మిళ, రాచెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'శాండల్
వుడ్ మీడియా' బ్యానర్ పై ' ఎస్. భారతీ కృష్ణ' చిత్రాన్ని నిర్మించారు. ఈ
నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు 'సింగీతం శ్రీనివాసరావు' మన
'10టివి'తో తమ సినిమా అనుభవాలు పంచుకున్నారు. వారి మాటల్లో చూద్దాం..
సినిమా అంటేనే ఒక ప్రయోగం: సింగీతం..
'' సినిమా ఏదైనా ఒక ప్రయోగమే. దీనిలో మేము ప్రేక్షకుల మీద ప్రయోగాలు చేస్తుంటాం. 'వెల్ కమ్ ఒబామ' కూడా అలాంటిదే. సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు క్యారెక్టర్స్ చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వాటిలో 'రాచెల్' అమెరికాకు చెందిన అమ్మాయి, 'ఉర్మిళ' ముంబయ్ కి చెందిన నటి, 'ఇష్టబాన్' ప్రెంచ్ కు చెందిన చిన్నకుర్రాడు, మరోకరు సంజీవ్ మన కుర్రాడే. సినిమా అంతా వీరి క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతూ.. ఉంటుంది. ఈ సినిమాకు మాటలు కూడా రాశాను. సంగీతం బాగా వచ్చింది. రాచెల్ తో కూడా పాట పాడించాను. తెలుగులో మొదటిసారి సినిమా చేస్తున్నాను. సంగీతం దర్శకుడిగా మాత్రం చాలా సినిమాలు చేశాను. దీనిలో 'వెల్ కమ్ ఒబామ' అనే టైటిల్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం.. దానితో పాటు నాటకాలు, కథలు, పాటలు రాయడం అలవాటు. అప్పటినుంచే దర్శకుడ్ని కావాలనే కోరిక ఉండేది. అందుకు గాను.. 'హరిశ్చంద్ర చటోపాధ్యాయ' అనే డైరెక్టర్ గా వద్ద థియేటర్ ఆర్టిస్టుగా చేరాను. ఆ సమయంలో పాటలు పాడే వాడిని, నటకాలు వేసే వాడిని. అ తర్వాత నాకు 'మాయా బజార్' సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. కాని దాని నుంచి తర్వాత డ్రాప్ అయ్యాను. కన్నడం సినిమాలకు ఎక్కువగా సంగీత దర్శకుడిగా చేశాను. రాజ్ కుమార్ తో సుమారు పది సినిమాలు తీశాను. ఒక సినిమాలో ఐదు పాటలకు లిరిక్స్ రాశాను. రాజ్ కుమార్ తనయుడి సినిమాలకు కూడా సంగీతం అందించాను.
త్వరలో 'ఆదిత్యా..999' సినిమా తీస్తాం..
'ఆదిత్యా 369'.. టైమ్ మిషన్ కు సంబంధించిన సినిమా. బాలకృష్ణతో ఈ సినిమా తీయాడానికి ముందు రెండు రకాలుగా ఆలోచించాను. సినిమాను వెనక్కి వెళ్లి తీసేటప్పుడు 'అక్బర్' కాలంలోకి వెళ్లాలా.. లేక 'శ్రీకృష్ణ దేవరాయల' కాలానికి వెళ్లాలా.. అనే దైలామా ఉండేది.. కానీ ఎన్టీఆర్ 'శ్రీకృష్ణ దేవరాయల' సినిమా తీయడం వల్ల అతని తనయుడు కాబట్టి అదే బెటర్ అనిపించింది. అలా సినిమా తీశాం. మళ్లీ ఆ సినిమాకు సిక్వెల్ గా 'ఆదిత్యా 999' పేరుతో సినిమా తీయాలని ప్లాన్ వేసుకున్నాం. దానికి కొంత సమయం పడుతుంది. కానీ కచ్చితంగా తీస్తాం.. '' అని అన్నారు.

No comments:
Post a Comment